Honor 20 స్మార్ట్ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్

Honor 20 Smartphone Price and Specifications [ in Telugu]



Honor 20 Smartphone Price and Specifications [ in Telugu]


Honor 20
స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఇండియా లో మొదటి సారిగా సేల్ లో పాల్గొననుంది.కొన్ని రోజుల క్రితం Honor ఈ ఫోన్ ను Honor 20i ,Honor 20 pro లతో పాటు ఇండియా లో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆల్రెడీ Honor 20i ఫోన్ June 18 న మొదటిగా సేల్ లో పాల్గొంది.Honor 20 Pro ఇంకా భారతీయ మార్కెట్ లను తాకలేదు.కాబట్టి ఇక మిగిలిన ఫోన్ Honor 20 సేల్ ఈ రోజు నుంచి Flipkart ద్వారా మరియు ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా జరుగనున్నది.మీరు ఈ క్రింద Honor 20 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను చదవవచ్చు.


Honor 20 Smart Phone Price:

Honor 20 ఫోన్ ఇండియా లో 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో Rs.32,999 ధర వద్ద లభిస్తుంది.ఈ ఫోన్ Sapphire Blue మరియు Midnight Black అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.ముందు చెప్పుకున్నట్లు గానే ఈ ఫోన్ సేల్ ఈ రోజు( June 25) నుంచి ప్రముఖ Offline స్టోర్ లలో మరియు  Flipkart ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి జరుగనున్నది.


Honor 20 Specifications:

ఈ Honor 20 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం తో  Magic UI 2.1 తో నడుస్తుంది.ఇది 6.26 అంగుళాల FHD+ (1080 x 2340 pixels) All View డిస్ప్లే ,హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా తో మరియు 19.5:9 aspect రేషియో తో వస్తుంది.ఈ Honor 20 లో HiSilicon Kirin 980 SoC ను ఉపయోగించారు.

ఇక కెమెరా పరంగా చూసుకుంటే ఈ ఫోన్ వెనుక భాగాన క్వాడ్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.ఈ ఫోన్ వెనుక 48-megapixel ప్రైమరీ కెమెరా,16-megapixel వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా,2-megapixel డెప్త్ సెన్సార్ ,2 -మెగాపిక్సల్ Macro కెమెరాను ఉపయోగించారు.సెల్ఫీల కోసం ఈ Honor 20 లో 32 మెగాపిక్సల్ కెమెరా ను ఉపయోగించారు.


మిగిలిన స్పెసిఫికేషన్స్ ను చూసుకుంటే Honor 20 128GB ఇంటర్నల్ మెమరీ తో వస్తుంది.కానీ దీనిలో microSD సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ స్టోరేజ్ ను మీరు పెంచుకోవడం కుదరదు.కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE ,Wi-Fi 802.11ac , Bluetooth v5.0 ,GPS/AGPS, USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి.దీనిలో ప్రత్యేకంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు.అనగా దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్ తో ఇంటిగ్రేట్ అయి వుంటుంది.

ఇది 3,750mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 22.5W Honor సూపర్ ఛార్జ్ ను సపోర్ట్ చేస్తుంది.మీరు దీనిలో కేవలం 30 నిమిషములలో 50 శాతం వరకు ఛార్జ్ ను పొందవచ్చు అని కంపెనీ అంటుంది.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు