Translate

12, జూన్ 2019, బుధవారం

Honor Pad 5 ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Honor Pad 5 launched in India: Price and Specifications in Telugu



Huawei యొక్క సబ్ బ్రాండ్ అయిన Honor మంగళవారం నాడు అనగా నిన్న Honor Pad 5 ను Honor 20,Honor 20 Pro, Honor 20i తో పాటు ఇండియా లో లాంచ్ చేసింది.ఈ Honor Pad 5 రెండు వేరియంట్ లలో వస్తుంది.ఒకటి 8 అంగుళాల తెరతో మరియు రెండవ వేరియంట్ 10.1 అంగుళాల తెరతో వస్తుంది.ఈ రెండు Android టాబ్లెట్స్ కూడా Full HD Display ,డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ప్రత్యేకమయిన ఫీచర్స్ తో రావడం గమనార్హం.



Honor Pad 5 ( 8-inch) and Honor Pad 5 ( 10.1-inch) Price:


ధర ను చూసినట్లు అయితే Honor Pad 5 ( 8-inch ) 3GB+32GB వేరియంట్ 15,499 అయితే 4GB+64GB వేరియంట్ ధర 17,499 రూపాయలుగా వుంది.

ఇక Honor Pad 5 ( 10.1-inch ) ధర 3GB+32GB ధర 16,999 కాగా 4GB+64GB ధర 18,999 రూపాయలుగా వుంది.

ఈ రెండు టాబ్లెట్స్ ను జులై నెలలో ఇండియా లో ఈ -కామర్స్ స్టోర్ అయిన Flipkart ద్వారా విక్రయించనున్నారు.కానీ ఈ Honor Pad 5 సేల్ కరెక్ట్ గా ఏ తేదీన జరుగుతుందో ప్రస్తుతానికి వెల్లడించలేదు.Honor Pad 5 (8-inch) వేరియంట్ మరియు 10.1 వేరియంట్ Glacial Blue colour లో వస్తున్నాయి.



Honor Pad 5 (8-inch) Specificatons:



Image Source: XDA developers


Honor Pad 5 ( 8-inch ) స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది Android 9 Pie తో Magic OS 2.0 UI మీద నడుస్తుంది.ఇది 8 అంగులాల ఫుల్ HD స్క్రీన్ (1920 x 1200 pixels) తో HiSilicon Kirin 710 చిప్ సెట్ తో వస్తుంది.అలాగే ముందు చెప్పుకున్నట్లు ఇది 3GB+32GB మరియు 4GB+64GB అనే రెండు వేరియంట్ లలో లభిస్తుంది.దీనిలో స్టోరేజ్ ను మీరు microSD స్లాట్ తో 512GB వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికి వస్తే దీనిలో ముందు భాగాన  8 megapixel కెమెరా మరియు వెనుక కూడా 8 megapixel కెమెరా ను అమర్చారు.ఇంకా ప్రత్యేకంగా దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ Dolby Atmos Sound తో వస్తున్నాయి.


దీనిలో సెక్యూరిటీ పరంగా Face unlock సదుపాయం వుంది.ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే దీనిలో 4G LTE,Voice calling, Wi-Fi, Blutooth, GPS యధావిధిగా వున్నాయి.



Honor Pad 5 (10.1- inch) Specifications:




Image Source: XDA developers

ఈ Honor Pad 5 (10.1 inch) మోడల్ Android 8 Oreo తో EMUI 8.0 తో నడుస్తుంది.ఇది 10.1 అంగుళాల ఫుల్ HD స్క్రీన్ (1920 x 1200 pixels) తో HiSilicon Kirin 659 SoC తో 3GB+32GB మరియు 4GB+64GB వేరియంట్ లలో వస్తుంది.మీరు దీనిలో స్టోరేజ్ ను 256GB వరకు microSD స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు.


ఇక దీనిలో వెనుక 8 MP కెమెరా ను, 2 MP ఫ్రంట్ కెమెరా ను గమనించవచ్చు.దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ Harman Kardon audio ట్యూనింగ్ తో పాటు వస్తున్నాయి.


దీనిలో  సెక్యూరిటీ పరంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ (ముందు భాగాన) మరియు Face unlock సదుపాయాల వున్నాయి.కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE ,Voice calling,Wi-Fi, Bluetooth, మరియు GPS వంటి సదుపాయాలు వున్నాయి.






Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి