Translate

27, జూన్ 2019, గురువారం

మీ Windows 10 కంప్యూటర్ లోని గ్రాఫిక్స్ కార్డు మోడల్ మరియు వివరాలను తెలుసుకోవడం ఎలా?

How to Check Your Graphics Card Model and Details in Windows 10 [ in Telugu ]


How to Check Graphics Card Model and Details in Windows 10 [ in Telugu ]


ఈ మధ్య కాలంలో వచ్చే చాలా కంప్యూటర్స్ Nvidia ,Intel మరియు AMD చే తయారు చేయబడిన GPU లను ఉపయోగించుకుంటున్నాయి.కొన్నింటిలో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటే కొన్నింటిలో డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటున్నాయి.

కంప్యూటర్ లో వున్న ముఖ్యమయిన భాగాలలో గ్రాఫిక్ హార్డ్ వేర్ కూడా ఎంతో ముఖ్యమయినది.ఇది గ్రాఫిక్స్ కు సంభందించిన అన్ని ఆపరేషన్స్ ను హ్యాండిల్ చేస్తుంది.

అయితే మనము వాడుతున్న కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయబడిన గ్రాఫిక్స్ కార్డు యొక్క మోడల్ గురించి కొంత మందికి తెలీదు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ లో కంప్యూటర్ లో ఇంస్టాల్ చేయబడిన గ్రాఫిక్స్ కార్డు యొక్క మోడల్ మరియు దాని గురించి కొన్ని డీటెయిల్స్ ను ఎలా తెలుసుకోవచ్చో ఈ క్రింది వివరించటం జరిగింది.

మీరు ఈ క్రింది మెథడ్స్  ద్వారా మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయబడిన గ్రాఫిక్స్ కార్డు మోడల్ ను ఈజీ గా తెలుసుకోవచ్చు.



How to Check Graphics Card Model by using Task Manager:


ఈ మెథడ్ లో మీరు టాస్క్ మేనేజర్ ను వుపయోగించి మీ గ్రాఫిక్ కార్డు మోడల్ గురించి తెలుసుకోవచ్చు.దీని ద్వారా మీరు గ్రాఫిక్ కార్డు మోడల్ మాత్రమే కాకుండా మీ గ్రాఫిక్స్ కార్డు Performance ను కూడా రియల్ టైం లో చూడవచ్చు.ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


  • ముందుగా మీ Windows కంప్యూటర్ లో కీబోర్డ్ లో Ctrl+Shift+Esc ను ప్రెస్ చేసి టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చేయండి.
  • తరువాత Performance అనే ట్యాబు ను క్లిక్ చెయ్యండి.



  • ఇప్పుడు ఎడమ ప్రక్క వున్న ఆప్షన్స్ లో GPU అనే దానిని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసి వున్న గ్రాఫిక్స్ కార్డు యొక్క మోడల్ తో పాటు దాని Performance ను కూడా మీరు రియల్ టైం లో చూడవచ్చు.


How to Check Graphics Card Model by using Run Command:


మీకు కనుక పైన చెప్పిన మెథడ్ లో GPU అనే ఆప్షన్ కనపడకపొతే మీరు ఈ మెథడ్ ద్వారా మీ గ్రాఫిక్ కార్డు డీటెయిల్స్ ను తెలుసుకోవచ్చు.ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం .


  • మొదటగా మీరు కంప్యూటర్ కీ బోర్డు లో Win+R ను ప్రెస్ చేసి రన్ కమాండ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత dxdiag అని రన్ కమాండ్ బాక్స్ లో టైపు చేసి ఎంటర్ ప్రెస్ చెయ్యండి.


How to Check Graphics Card Model and Details in Windows 10 [ in Telugu ]

  • ఇప్పుడు మీకు DirectX Diagnosis tool ఓపెన్ అవుతుంది.

How to Check Graphics Card Model and Details in Windows 10 [ in Telugu ]

  • మీరు దానిలో వున్న Display అనే ట్యాబ్ మీద క్లిక్ చెయ్యగానే మీ గ్రాఫిక్స్ కార్డు గురించి సమాచారం డిస్ప్లే అవుతుంది.


మీరు ఈ విధంగా Windows 10 లో GPU మోడల్ ను మరియు దాని గురించి కొంత వివరాలను తెలుసుకోవచ్చు.ఈ వివరాలు భవిష్యత్తులో చాలా ఉపయోగపడవచ్చు.పైన పేర్కొన్న విధానాలు  కాకుండా ఇంకా మీకు ఏమయినా మెథడ్స్ తెలిస్తే ఈ క్రింద కామెంట్ బాక్స్ లో రాయండి.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి