Instagram bio ను వివిధ ఫాంట్ స్టైల్స్ లో క్రియేట్ చేసుకోవడం ఎలా?

How to Change Bio and Posts Font On Instagram in Android 




How to Change Bio and Posts Font On Instagram in Android


ఫోటో మరియు వీడియో షేరింగ్ Platform అయిన ఇంస్టాగ్రామ్ ను ఈ మధ్య చాలా మంది ఉపయోగిస్తున్నారు.ఈ Platform ను వుపయోగించి మనము వీడియోలను మరియు ఫోటోలను షేర్ చేసుకోవచ్చు అని మనకు తెలిసిందే.


ఫేస్ బుక్ లో లాగానే ఇంస్టాగ్రామ్ లో కూడా Bio అనే ఫీచర్ ద్వారా మనము మన గురించి రాసుకునే వీలు వుంటుంది.దీని ద్వారా కొంతమంది తమ గురించి డీటెయిల్స్ రాసుకుంటే కొంతమంది quotations ను పెట్టుకుంటారు.


ఇది ఇలాగు ఉంటే మీరు కొంతమంది Bio లను పరిశీలించినప్పుడు బయో కి ఉపయోగించిన టెక్స్ట్ యొక్క ఫాంట్స్ ప్రత్యేకంగా ఉండటం గమనించేవుంటారు.ఇప్పుడు మనము ఈ పోస్ట్ లో ఇంస్టాగ్రామ్ bio ను వివిధ ఫాంట్స్ తో ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం.

  • మొదటగా మీరు Cool Fonts - Stylish Fancy Cool Text Generator అనే అప్లికేషన్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
  • తరువాత అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యండి.
  • ఇప్పుడు అప్లికేషన్ పై భాగం లో ఒక బాక్స్ కనపడుతుంది.మీరు దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన బయో ను టైపు చెయ్యండి.మీరు టైపు చేస్తుండగానే అప్లికేషన్ లో మీరు టైపు చేసిన టెక్స్ట్ వివిధ ఫాంట్ స్టైల్ లో క్రియేట్ అవ్వటం గమనించేవుంటారు.


    How to Change Bio and Posts Font On Instagram in Android


    • మీరు bio ను టైపు చేసిన తరువాత మీకు నచ్చిన font స్టైల్ మీద క్లిక్ చెయ్యగానే టెక్స్ట్ కాపీ అయిపోతుంది.


    తరువాత వెనుకకు వచ్చి ఇంస్టాగ్రామ్ ను ఓపెన్ చేసి profile ఐకాన్ మీద క్లిక్ చెయ్యండి.ఇప్పుడు Edit profile మీద క్లిక్ చేసి Bio అనే దాని మీద క్లిక్ చేసి అక్కడవున్న text ను డిలీట్ చేసి ఇందాక కాపీ చేసిన టెక్స్ట్ ను పేస్ట్ చెయ్యండి.తరువాత Right సింబల్ మీద క్లిక్ చేసి బయో ను సేవ్ చేసుకోండి.ఇప్పుడు మీ Bio కూడా ఎంతో ప్రత్యేకంగా కనపడుతుంది.


    మీరు ఈ మెథడ్ ను ఉపయోగించుకుని ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ పోస్ట్ లకు కూడా Captions ను యిచ్చుకోవచ్చు.


    అలాగే మీరు ఈ అప్లికేషను లో క్రింది భాగాన వున్న Text Decorator అనే దానిపై క్లిక్ చేసి టెక్స్ట్ ను టైప్ చేసి మరిన్ని స్టైల్స్ ను పొందవచ్చు.



    How to Change Bio and Posts Font On Instagram in Android



    ఈ విధంగా మీరు ఇంస్టాగ్రామ్ లోని Bio కు మరియు పోస్ట్ లకు వివిధ ఫాంట్ స్టైల్స్ ను ఉపయోగించవచ్చు.ఇలా వివిధ ఫాంట్ స్టైల్స్ ను ఉపయోగించటం వల్ల మీ ప్రొఫైల్ ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది.


    Also Read: ఇంస్టాగ్రామ్ లో మీరు గతం లో లైక్ చేసిన పోస్ట్ లను చూడటం ఎలా?

    Also Read: ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ను ఎటువంటి అప్లికేషన్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?



    Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


    మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


    Post a Comment

    0 Comments