iOS 13 మరియు క్రొత్త iPadOS ను పొందే డివైస్ లు ఇవే..

Here are all the devices that are getting iOS 13 and iPadOS in Telugu





ఆపిల్ సంస్థ తన క్రొత్త iOS 13 ను సోమవారం నాడు Worldwide Developers Conference 2019 లో ఇంట్రడ్యూస్ చేసిన విషయం తేలిసిందే.ఈ క్రొత్త వెర్షన్ లో ఆపిల్ చాలా improvements ను చేసింది.వీటిలో సిస్టం వైడ్ డార్క్ మోడ్ ను తీసుకురావడం ,కీ బోర్డు ఫంక్షనాలిటీ ను ఇంప్రూవ్ చెయ్యటం మొదలయినవి వున్నాయి.

దీనితో పాటు ఆపిల్ తన ఐపాడ్ లకు కూడా క్రొత్త iPadOS ను పరిచయం చేసింది.ఈ క్రొత్త iPadOS ను ఐపాడ్ డివైస్ లలో ప్రొడక్టివిటీ ను పెంచే విధంగా మలిచారు.

ఒకసారి గతంలో చూసినట్లు అయితే iOS 12 అప్డేట్ ను ఆపిల్ సంస్థ iOS 11 పై నడుస్తున్న అన్ని డివైస్ లకు యిచ్చింది.కానీ ఈసారి మాత్రం iOS 13 ఈ క్రింది డివైస్ లకు మాత్రమే వస్తుంది అని తెలుస్తుంది.

  • iPhone XS Max
  • iPhone XR
  • iPhone X
  • iPhone XS
  • iPhone 8
  • iPhone 8 Plus
  • iPhone 7
  • iPhone 7 Plus
  • iPhone 6S
  • iPhone 6S Plus
  • iPhone SE
  • iPod Touch (seventh generation)





ఇక ఐపాడ్ ల కొరకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసిన క్రొత్త iPadOS ఈ క్రింది డివైస్ లకు సపోర్ట్ చేస్తుంది.


  • iPad Pro (12.9-inch)
  • iPad Pro (11-inch)
  • iPad Pro (10.5-inch)
  • iPad Pro (9.7-inch)
  • iPad (sixth generation)
  • iPad (fifth generation)
  • iPad mini (fifth generation)
  • iPad mini 4
  • iPad Air (third generation)
  • iPad Air 2 



దీనిని బట్టి చూస్తే iPad Air మరియు iPad mini 2 లు ఈ క్రొత్త iPadOS ను పొందలేవు అని తెలుస్తుంది.



ఇక ఈ iOS 13 మరియు iPadOS Public బీటా వెర్షన్ లను ఆపిల్ సంస్థ జూలై నెల లో విడుదల చేసే అవకాశాలు వున్నాయి మరియు ఫైనల్ స్టేబుల్ వెర్షన్ ను సెప్టెంబర్ నెలలో తన క్రొత్త డివైస్ లతో పాటు విడుదల చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.



Also Read: ఆండ్రాయిడ్ లో ఒకేసారి ఎక్కువ అప్లికేషన్స్ ను Uninstall చెయ్యటం ఎలా?

Also Read: ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments