Nubia Red Magic 3 ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Nubia Red Magic 3 Launched in India: Price and Specifications in Telugu 


Nubia Red Magic 3 Launched in India: Price and Specifications in Telugu

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారుదారు Nubia తన క్రొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic 3 ను సోమవారం నాడు ఇండియా లో లాంచ్ చేసింది.ఈ స్మార్ట్ ఫోన్ ను ముఖ్యంగా గేమర్స్ ను టార్గెట్ చేస్తూ తీసుకువచ్చారు.దీనిలో Snapdragon 855 SoC ను ఉపయోగించారు.ఈ ఫోన్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తో పాటు ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ ,90Hz HDR compatible డిస్ప్లే ,స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.ఈ ఫోన్ యొక్క సేల్  June 27 న Flipkart లో మధ్యాహ్నం 12 గంటల నుండి జరుగనున్నది.


Nubia Red Magic 3 Price and Offers: 

ఈ ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర Rs.35,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర Rs.46,999 గా వుంది.8GB+128GB వేరియంట్ రెడ్ మరియు బ్లాక్ కలర్ లలో వస్తే 12GB+256GB వేరియంట్ మాత్రం camo ఫినిష్ తో వస్తుంది.


ఇక ఆఫర్స్ ను చూసినట్లు అయితే ఈ ఫోన్ మీద కొనుగోలుదారులు no-cost EMI ఆప్షన్స్,కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ వంటి ఆఫర్స్ ను పొందవచ్చు.


Nubia Red Magic 3 Specifications :


Nubia Red Magic 3 ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం తో మరియు 6.65 అంగుళాల FHD+ (1080 x 2340 pixels) HDR AMOLED తెర తో ,90Hz ల రిఫ్రెష్ రేట్,430 nits ల బ్రైట్ నెస్,19.5:9 aspect రేషియో తో వస్తుంది.దీనిలో Qualcomm Snapdragon 855 SoC ను , Andreno 640 GPU ను వాడారు.

కెమెరా పరంగా చూసుకుంటే Red Magic 3 వెనుక వైపున 48-megapixel Sony IMX586 sensor ను ఉపయోగించారు.దీని ద్వారా మీరు 8K రికార్డింగ్ కూడా చెయ్యొచ్చు అని కంపెనీ చెప్తుంది.ఈ ఫోన్ ముందు వైపున 16-megapixel కెమెరా ను వాడారు.

ఈ స్మార్ట్ ఫోన్ లో రెండు ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్స్ ను అమర్చారు.ఇవి DTS:X ,3D టెక్నాలజీ తో వస్తున్నాయి.


ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ ను చూసినట్లు అయితే దీనిలో 4G LTE ,Wi-Fi ,Bluetooth 5.0,GPS ,USB Type -C పోర్ట్ మరియు 3.5 mm jack మొదలయినవి వున్నాయి.ఈ Nubia Red Magic 3 ఫోన్ 5,000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ను కూడా సపోర్ట్ చేస్తుంది అని తెలుస్తుంది.

ఈ ఫోన్ లో fingerprint, accelerometer, compass, gyroscope, proximity మరియు ambient light మొదలయిన సెన్సార్స్ ను గమనించవచ్చు.


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు