Xiaomi మరియు Oppo వాడిన ఈ క్రొత్త సెల్ఫీ కెమెరా టెక్నాలజీ ను చూస్తే ఆశ్చర్యపోతారు!

Xiaomi, Oppo Showcase Smartphone With Under-Display Selfie Camera





స్మార్ట్ ఫోన్ కంపెనీ లు తమ ఫోన్ లలో క్రొత్త టెక్నాలజీ ను తెచ్చి ప్రజల యొక్క దృష్ణిని ఆకర్షిస్తున్నాయి.ఈ మధ్య కొన్ని స్మార్ట్ ఫోన్  కంపెనీ లు పాప్ అప్ కెమెరా, పంచ్ హోల్ Display టెక్నాలజీ ను  తీసుకువచ్చాయి.


వీటన్నింటిని పరిశీలిస్తే కంపెనీలు వీలయినంత మేరా స్క్రీన్ చుట్టూ ఎలాంటి అంచులూ లేని డిస్ప్లే ను తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి అని అర్ధం అవుతుంది.సాధారణంగా మొబైల్ కు ముందు వుండే సెల్ఫీ కెమెరా ను ఏదో విధంగా స్క్రీన్ మీద లేకుండా Adjust చేయగలిగితే యూజర్స్  కు మరింత స్క్రీన్ ఏరియా లభిస్తుంది.ఈ ఆలోచనతోనే చాలా కంపెనీ లు ఈ పాప్ అప్ కెమెరా లాంటి వాటిని తీసుకువస్తున్నాయి.


సరిగ్గా ఈ ఆలోచనతోనే Xiaomi మరియు Oppo కూడా ఒక క్రొత్త టెక్నాలజీ ను తమ ఫోన్ల లో వాడాయి.దీనిలో సెల్ఫీ కెమెరా పూర్తిగా స్క్రీన్ లో అమర్చబడి ఉంటుంది.దీని వల్ల యూజర్ కు ఫుల్ స్క్రీన్ ఏరియా లభిస్తుంది.


గతం లో LG ఈ టెక్నాలజీ కి సంబంధించి ఒక పేటెంట్ ను కూడా కలిగివుంది.మరియు Samsung కూడా యిదే టెక్నాలజీ మీద కసరత్తు చేస్తుంది అని తెలుస్తుంది.


ఈ టెక్నాలజీ కి సంభందించి Oppo ఒక చిన్న వీడియో ట్వీట్ చేసింది.దానిని మీరు ఈ క్రింద చూడవచ్చు.





అలానే Xiaomi కూడా ఈ రకమయిన టెక్నాలిజీ ను తెస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఈ క్రింది వీడియో ను ట్వీట్ చేసింది.




ఇదే కాకుండా కొన్ని కంపెనీ ను తమ ఫోన్ లలో  స్పీకర్స్ ను కూడా స్క్రీన్ లోపల అమర్చే ఏర్పాట్లు చేస్తున్నాయి అని తెలుస్తుంది.


ఈ సెల్ఫీ కెమెరా టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అయ్యి మార్కెట్ లోకి రావడానికి మరింత సమయం పడుతుంది.

ఒకసారి గతం లోకి తొంగి చూసినట్లు అయితే weibo వేదికగా Xiaomi తన మడతపెట్టే స్మార్ట్ ఫోన్ ను చూపిస్తూ ఒక వీడియో ను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Also Read:  Vodafone యొక్క Rs.229 ప్లాన్ తో అపరిమిత కాల్స్ మరియు డైలీ 2GB డేటా ను పొందవచ్చు. వివరాలు ఇవి..

Also Read:  ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments