Translate

20, జూన్ 2019, గురువారం

Samsung Galaxy M40 మొబైల్ ధర మరియు పూర్తి వివరాలు..

Samsung Galaxy M40 Mobile Price and Full Specifications



Samsung Galaxy M40 Goes live again via Amazon.in and Samsung Online Store: Price , Specifications an Offers [Telugu]


Samsung Galaxy M40 మొబైల్ ఇండియన్ మార్కెట్ లోకి విడుదల అయ్యి ఆల్రెడీ ఒకసారి సేల్ లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మరలా ఈరోజు Amazon India మరియు Samsung ఆన్లైన్ స్టోర్ ద్వారా జరుగనున్నది.


Samsung Galaxy M40 స్మార్ట్ ఫోన్ 6GB /128GB వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది.ఈ ఫోన్  FHD+ డిస్ప్లే ,త్రిపుల్ రియర్ కెమెరా సెటప్ , Snapdragon 675 SoC ,Andreno 612 GPU వంటి ప్రత్యేకతలతో వస్తుంది.అలానే దీనిలో ఇయర్ పీస్ అవసరం లేకుండా డైరెక్ట్ గా స్క్రీన్ నుంచే శబ్దం వచ్చే విధంగా స్క్రీన్ సౌండ్ అనే క్రొత్త టెక్నాలజీ ను ఉపయోగించారు.



Samsung Galaxy M40 Price :

ఈ స్మార్ట్ ఫోన్ 6GB /128GB వేరియంట్ Rs.19,990 కు  లభిస్తుంది.ఈ ఫోన్ Seawater blue మరియు Midnight blue అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మరలా ఈరోజు Amazon India మరియు Samsung ఆన్లైన్ స్టోర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నది.



Samsung Galaxy M40 Specifications:

ఇక స్పెసిఫికేషన్స్ ను చూస్తే Samsung Galaxy M40 ఆండ్రాయిడ్ 9 Pie మరియు One UI మీద నడుస్తుంది.ఈ ఫోన్ 6.3 అంగుళాల FHD+ (2340 x1080 pixels) తెరతో వస్తుంది.దీనిలో Qualcomm Snapdragon 675 SoC మరియు Andreno 612 GPU ను ఉపయోగించారు.

కెమెరా పరంగా చూస్తే దీనిలో వెనుక భాగాన 32-megapixel (ప్రైమరీ) , 8-megapixel (అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ) , 5-megapixel  (డెప్త్ సెన్సార్ ) ట్రిపుల్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.ఈ ఫోన్ ముందు భాగాన 16MP కెమెరాను గమనించవచ్చు.

ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మరియు 6GB RAM తో వస్తుంది.మీరు micorSD ద్వారా స్టోరేజ్ ను 512GB వరకు పెంచుకోవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi ,Bluetooth, GPS / A-GPS మరియు USB Type-C  Port మొదలయినవి వున్నాయి.


సెక్యూరిటీ దృష్ట్యా దీనిలో వెనుక భాగాన ఫింగర్  ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్ లాక్ సదుపాయాలు వున్నాయి.ఇక ఈ Samsung Galaxy M40 మొబైల్ 3,500mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి