లిడ్ ను మూయగానే మీ లాప్ టాప్ షట్ డౌన్ అయ్యే విధంగా సెట్ చెయ్యటం ఎలా? [Windows]

How to Shut down Laptop When Laptop's lid is closed in Windows [in Telugu]


How to Shut down Laptop When Laptop's lid is closed in Windows [Telugu]


డెస్క్ టాప్ కంప్యూటర్ తో పోల్చుకుంటే లాప్ టాప్ వాడేవారికి కొన్ని ప్రత్యేకమయిన ఫీచర్స్ ఉంటాయి.దీనికి కారణం లాప్ టాప్ లో వుండే వివిధ ప్రత్యేక హార్డ్ వేర్ భాగాలు.టచ్ పాడ్ ,లాప్ టాప్ లిడ్ ,మరియు వివిధ పోర్ట్ లు ప్రత్యేక హార్డ్ వేర్ కు ఉదాహరణలు.కాబట్టి లాప్ టాప్ లు ఎప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంటాయి.

ఇక టాపిక్ లోకి వెళితే ముందుగా చెప్పుకున్నట్లుగానే లాప్ టాప్ లిడ్ ను మూసినప్పుడు జనరల్ గా లాప్ టాప్  స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది లేదా రన్ అవుతూనే ఉంటుంది.కానీ మనం ఈ లాప్ టాప్ లిడ్ ను మూసినప్పుడు Laptop షట్ డౌన్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు.ఇది ఎలాగో ఇప్పుడు మనము చూద్దాం.



  • మొదటగా మీరు కీ బోర్డు లో Win+R ను ప్రెస్ చేసి రన్ కమాండ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత ఆ బాక్స్ లో control అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చెయ్యండి.
  • ఇప్పుడు Hardware and Sound అనే దానిమీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత Power Options మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు ఎడమ చేతి వైపు వున్న ఆప్షన్స్ లో Choose what closing the lid does అనే దానిని క్లిక్ చెయ్యండి.
How to Shut down Laptop When Laptop's lid is closed in Windows [Telugu]

  • ఇప్పుడు మీరు When I close the lid అనే ఆప్షన్స్ దగ్గర రెండు కాలమ్స్ లో సెట్టింగ్స్ ను గమనించవచ్చు.మీరు When I close the lid అనే ఆప్షన్ కు ఎదురుగా వున్న రెండు డ్రాప్ డౌన్ బాక్స్ ల మీద క్లిక్ చేసి shutdown అని సెట్ చేసుకోవచ్చు.

How to Shut down Laptop When Laptop's lid is closed in Windows [Telugu]


Note: మీరు మీ లాప్ టాప్ యొక్క లిడ్ బిహేవియర్ ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఒకలాగా మరియు బ్యాటరీ మీద నడుస్తున్నప్పుడు ఒకలాగా విడివిడిగా కూడా సెట్ చేసుకోవచ్చు.

  • తరువాత సింపుల్ గా Save changes మీద క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మీరు మీ లాప్ టాప్ యొక్క లిడ్ మూయగానే Laptop షట్ డౌన్ అవ్వటం గమనించవచ్చు.


Read Also: ప్రతి విండోస్ యూజర్ తప్పకుండా తెలుసుకోవలసిన టాప్ 15 రన్ కమాండ్స్

Read Also: విండోస్ 10 లో ప్రతి అప్లికేషన్ యొక్క సౌండ్ ను సెపెరేట్ గా కంట్రోల్ చెయ్యటం ఎలా?


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు