Top 3 Best Free Android Web Browsers with VPN 2019 in Telugu


Top 3 Best Free Android Web Browsers with VPN 2019 in Telugu

ఆన్లైన్ ప్రపంచం లో మనము చేసే యక్టివిటి చాలా శాతం ప్రైవేట్ గా ఉండదు అని తెలిసిందే.మన డేటా ను చాలా సంస్థలు మరియు చాలా మంది కొన్ని కారణాల వల్ల ట్రాక్ చేస్తూ వుంటారు.కానీ కొందరు మన అంగీకారం తీసుకుని ట్రాక్ చేస్తే మరికొందరు మన అనుమతి లేకుండా ట్రాక్ చేస్తూ చేస్తుంటారు.చాలా ప్రసిద్ధి చెందిన సంస్థలు అయిన Microsoft మరియు Google కూడా మన ఆన్లైన్ యాక్టీవిటీ ను ట్రాక్ చేసి మనకు తగినట్లుగా యాడ్స్ ను చూపిస్తూ ఉంటాయి.


ఈ పరిస్థితులలో చాలా మంది సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు లు VPN ను వాడమని సజెస్ట్ చేస్తూ వుంటారు.VPN అంటే Virtual Private Network అని మనకు తెలిసిందే.దీని ద్వారా మన డేటా Encrypt అవుతుంది.తద్వారా మన డేటా ఎక్కువ శాతం సేఫ్ గా ఉంటుంది మరియు మనము ananymous గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు.


అయితే మీరు కనుక Low-end ఆండ్రాయిడ్ డివైస్ ను వాడుతుంటే VPN అప్లికేషన్ ను మరియు బ్రౌజర్ ను ఒకేసారి యూజ్ చేస్తే ఫోన్ lag అయ్యే ఛాన్స్ వుంది.అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అనుకుంటున్నారా? మీరు ఏమి విచారించనవసరం లేదు.. ఎందుకంటే ప్లే స్టోర్ లో కొన్ని బ్రౌజర్లు వున్నాయి.వాటిలో ఈ VPN అనేది in-built గా వస్తుంది.కాబట్టి మీరు VPN కు వేరే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోకుండానే డైరెక్ట్ గా బ్రౌజర్ లోనే VPN ను ఆన్ చేసుకుని కంట్రీ ను సెలెక్ట్ చేసుకుని మీ డేటా ను కాపాడుకోవచ్చు.అలానే మీ కంట్రీ లో బ్యాన్ అయిన వెబ్సైట్స్ ను యాక్సిస్ చేసుకోవచ్చు.


Note: కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మెథడ్ ద్వారా మీరు VPN ను కేవలం బ్రౌసర్ లెవెల్ లో ఉపయోగించగలరు.అంటే ఈ మెథడ్ లో కేవలం బ్రౌజర్ ద్వారా చేసిన యాక్టీవిటీ మాత్రమే Secure గా ఉండటానికి ఛాన్స్ వుంది.ఎందుకు అంటే ఈ మెథడ్ ద్వారా VPN అనేది కేవలం browser వరకే పరిమితం అవుతుంది.


ఇప్పుడు మనము ప్లే స్టోర్ లో VPN తో సహా లభించే టాప్ 3 ఆండ్రాయిడ్ బ్రౌజర్స్ గురించి తెలుసుకుందాం.


Opera Browser


VPN ఫీచర్ in-built గా వచ్చే ఆండ్రాయిడ్ బ్రౌజర్స్ లో Opera Browser ప్రముఖమయినది.దీనిలో మీరు VPN ను ఎనేబుల్ చేసుకుని కావలిసిన కంట్రీ ను సెలెక్ట్ చేసుకుని VPN సర్వీస్ ను ఫ్రీ గా ఆనందించవచ్చు.ఈ బ్రౌజర్ లో ఈ VPN ఫీచర్ మాత్రమే కాకుండా adblocker,night mode వంటి ఫీచర్స్ కూడా ఉండటం వల్ల ఈ బ్రౌజర్ ను ఒక బెస్ట్ బ్రౌజర్ గా చెప్పుకోవచ్చు.


Aloha Browser

Aloha Browser కూడా అంతర్గత VPN తో వస్తుంది.దీనిలో మీరు కేవలం ఒక్క సింగల్ టాప్ తో VPN టన్నెల్ లు క్రియేట్ చెయ్యొచ్చు.బ్రౌసర్ ను ఓపెన్ చేసిన తరువాత ఎడమ ప్రక్కన పై భాగాన వున్న VPN ఐకాన్ ను టాప్ చెయ్యగానే VPN ఆక్టివేట్ అవుతుంది.దీనిలో కూడా యాడ్స్ ను బ్లాక్ చేసేందుకు పవర్ఫుల్ టూల్స్ వున్నాయి.మీకు ఈ బ్రౌజర్ లైట్ వెర్షన్ లో కూడా లభ్యం అవుతుంది.


Hola Free VPN Proxy

ఈ Hola free VPN proxy unblocker ప్లే స్టోర్ లో ని అన్ని అప్లికేషన్స్ లో ఒక ఫేమస్ అయిన అప్లికేషన్.ఈ అప్లికేషన్ ను వుపయోగించి మీరు వివిధ అప్లికేషన్స్ కు విడివిడిగా VPN టన్నెల్ ను క్రియేట్ చేసుకోవచ్చు మరియు దీనిలో అంతర్గతంగా వచ్చిన బ్రౌజర్ ద్వారా ananymous గా బ్రౌజ్ చేసుకోవచ్చు.కాబట్టి ఈ అప్లికేషన్ ను వుపయోగించి అప్లికేషన్ లెవెల్ లో మరియు బ్రౌసర్ లెవెల్ లో VPN ను ఉపయోగించుకోవచ్చు.


ప్లే స్టోర్ లో ఇంకా అనేక బ్రౌజర్లు VPN తో వున్నా కూడా వాటిల్లో పైన పేర్కొన్న బ్రౌజర్లు ప్రఖ్యాతి పొందినవి.ఇలా మీరు మీ కంట్రీ లో బ్యాన్ అయిన కంటెంట్ ను యాక్సిస్ చెయ్యొచ్చు.అలానే మీ డేటా కు ఒక సెక్యూర్ లేయర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు.


Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే రాయటం జరిగింది.మేము ఎలాంటి illegal కార్యకలాపాలను ప్రోత్సహించము.

Also Read: ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి

Also Read: Instagram bio ను వివిధ ఫాంట్ స్టైల్స్ లో క్రియేట్ చేసుకోవడం ఎలా?


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

సరిక్రొత్తది పాతది