విండోస్ 10 Calculator ను ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ లో ఉపయోగించుకోవచ్చు! వివరాలు ఇవి..

How to use Windows 10 Calculator on Android and iOS [ in Telugu]



Windows 10 ఆపరేటింగ్ సిస్టంలో ప్రాముఖ్యత పొందిన అప్లికేషన్స్ లో calculator ఒకటి. దీనిని వుపయోగించి మనం ఎన్నో రకాల calculations చేసుకోవచ్చు.దీనిలో Standard,programmer calculator మరియు Scientific calculator తో పాటు ఎన్నో రకాల ఎనర్జీ,మాస్ ,టెంపరేచర్ మొదలయిన  conversions ఇమిడి వున్నాయి.కొన్ని రోజుల క్రితం Windows తన ఫేమస్ అప్లికేషన్ అయిన Windows 10 Calculator ను ఓపెన్ సోర్స్ చేసింది.





దీనిని అవకాశంగా తీసుకుని Uno Platform వాళ్ళు ఈ Windows 10 calculator కోడ్ ను సాయశక్తులా మార్చి ఈ  అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ ,iOS మరియు Web platform కు విస్తరించారు.


దీని ద్వారా ఆండ్రాయిడ్ ,iOS వినియోగదారులు విండోస్ లో ఏ విధంగా  calculator ను ఉపయోగించారో అలాగే ఉపయోగించుకోవచ్చు.


మీరు ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.ఈ  Windows 10 calculator ప్లే స్టోర్ లో Uno Calculator అనే పేరుతో లభిస్తుంది.



iOS వినియోగదారులు తమ డివైస్ లో Test Flight  ను సెటప్ చేసుకుని ఈ అప్లికేషన్ యొక్క Beta వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీరు ఎటువంటి అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోకుండా వెబ్ వెర్షన్ ద్వారా కూడా మీరు ఈ calculator ను ఉపయోగించుకోవచ్చు.


మీ ఫోన్ లోని డిఫాల్ట్ calculator తో పోల్చుకుంటే ఈ అప్లికేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.కాబట్టి బేసిక్ calculator కలిగిన మొబైల్ వినియోగదారులు ఈ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకుని వినియోగించుకోవచ్చు.


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు