Translate

22, జూన్ 2019, శనివారం

Windows కంప్యూటర్ ను కొంత సమయం తరువాత ఆటోమేటిక్ గా షట్ డౌన్ చెయ్యటం ఎలా?

automatically after some time

How to Shutdown Windows PC Automatically After Sometime [in Telugu]



How to Shutdown Windows PC Automatically After Sometime [in Telugu]


కంప్యూటర్ ను మనము షట్ డౌన్ చెయ్యటానికి వివిధ పద్దతులను ఉపయోగిస్తాము.వీటిలో Alt+F4 ను ప్రెస్ చెయ్యటం మరియు స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి పవర్ బటన్ ద్వారా షట్ డౌన్ చెయ్యటం ప్రఖ్యాతి పొందినవి.

కాని కొన్ని సార్లు మనము కంప్యూటర్ లో ఏదో ఒక ఫైల్ ను డౌన్లోడ్ లో పెట్టి వేరే పనిలో మునిగిపోయి కంప్యూటర్ ను షట్ డౌన్ చెయ్యటం మర్చిపోతారు.కాని ఒక సులభమయిన పద్దతి ద్వారా మీరు కంప్యూటర్ ను కొంత సమయం తరువాత ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు.దీనివల్ల మీరు ఒక వేల కంప్యూటర్ ను షట్ డౌన్ చెయ్యటం మర్చిపోయినా కూడా కంప్యూటర్ ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది.

Windows కంప్యూటర్ ను ఆటోమేటిక్ గా షట్ డౌన్ చేయటానికి చాలా మార్గాలు వున్నాయి.వాటిలో ఒక ఈజీ మెథడ్ ను ఇప్పుడు చూద్దాం.

  • మొదటగా మీరు మీ కంప్యూటర్ కీ బోర్డు లో Win+R ను ప్రెస్ చెయ్యటం ద్వారా రన్ కమాండ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత రన్ బాక్స్ లో shutdown -s -t 1800 అని టైపు చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చెయ్యండి.

Note: పైన  చెప్పిన కమాండ్ లో 1800 అని వున్న చోట మీరు కంప్యూటర్ ను ఎన్ని సెకండ్స్ తరువాత ఆఫ్ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ నెంబర్ ను వుంచండి.

ఉదా : shutdown -s -t 1800    (ఈ కమాండ్ ద్వారా మీ కంప్యూటర్ 30 నిమిషాల తరువాత ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది)


How to Shutdown Windows PC Automatically After Sometime [in Telugu]



  • ఇప్పుడు మీ కంప్యూటర్ మీరు సెట్ చేసిన సెకండ్స్ తరువాత షట్ డౌన్ అయిపోతుంది.



మీరు కనుక మీరు సెట్ చేసిన షట్ డౌన్ టైమర్ ను మధ్యలోనే ఆపి వెయ్యాలి అని అనుకుంటే Win+R ను ప్రెస్ చేసి రన్ కమాండ్ బాక్స్ లో shutdown -a అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చెయ్యండి.


ఇలా మీరు ఈజీ గా  మీ విండోస్ కంప్యూటర్ ను ఆటోమేటిక్ గా కొంత సమయం తరువాత షట్ డౌన్ చేసుకోవచ్చు.ఈ టిప్ మీకు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది.


ఈ మెథడ్ ను మీరు ఎటువంటి సందర్భంలో ఉపయోగించాలి అని అనుకుంటున్నారో ఈ క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.


Also Read: లిడ్ ను మూయగానే మీ లాప్ టాప్ షట్ డౌన్ అయ్యే విధంగా సెట్ చెయ్యటం ఎలా? [Windows]

Also Read: విండోస్ డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ను ఎడమ ప్రక్కన కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవడం ఎలా?


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి