మీరు వాడుతున్న బ్రౌజర్ Up-to-date గా వుందో, లేదో సింపుల్ గా ఇలా తెలుసుకోండి!




Does your browser needs to be updated? Check with this Website [ in Telugu]




Does your browser needs to be updated? Check with this Website [ in Telugu]


ఆన్లైన్ లో రకరకాల యాడ్ వేర్ ,స్పై వేర్ లాంటి వివిధ రకాల మాల్వేర్ లను వుపయోగించి మన డేటా ను దొంగిలించటానికి Hackers ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటారు.అవకాశం దొరకగానే మన డేటాను దొంగిలించటానికి ప్రయత్నిస్తారు.కాబట్టి మనము మన PC ను హై క్వాలిటీ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ లతో స్కాన్ చేసుకుంటూ ఎల్లప్పుడూ సేఫ్ గా ఉంచుకోవటంతో పాటు అప్లికేషన్స్ ను కూడా ఎప్పుడూ అప్డేట్ గా ఉంచుకోవాలి.


మనము ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవలసిన అప్లికేషన్స్ లలో బ్రౌజర్ ఒకటి.ఎందుకంటే బ్రౌజర్ లు పాస్వర్డ్ లు వంటి సెన్సిటివ్ డేటా ను కలిగి వుంటాయి.అలానే ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఉపయోగించే మనము వివిధ సురక్షిత మరియు అసురక్షిత  వెబ్సైట్స్ ను విజిట్ చేస్తాము.

ఆన్లైన్ లో జరిగే వివిధ మార్పులను దృష్టిలో ఉంచుకుని డెవలపర్ లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ లను బ్రౌజర్ కు అప్డేట్ రూపంలో అందిస్తారు.అలానే మీరు బ్రౌజర్ ను అప్డేట్ చేసుకోవడం వల్ల డెవలపర్ అందించే వివిధ ఫీచర్స్ ను కూడా పొందగలరు.


అయితే ఈ బ్రౌజర్స్ లో కొన్ని అప్డేట్ రాగానే మనకు తెలియచేస్తాయి.మరికొన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి.కాని కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల బ్రౌజర్ ఆటోమేటిక్ గా అప్డేట్ కాదు.ఇలాంటి సందర్భాల్లో మీరు వాడుతున్న బ్రౌజర్ అప్ టు డేట్ గా వుందో లేదో manual గా చెక్ చేసుకోవడం మంచిది.


దీనికి మీరు సింపుల్ గా ఏ బ్రౌజర్ ను అయితే చెక్ చెయ్యాలి అని అనుకుంటున్నారో దానిని వుపయోగించి whatismybrowser వెబ్సైటు లేదా updatemybrowser వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.


మీరు పైన పేర్కొన్న వెబ్సైట్ ల లోకి వెళ్లిన వెంటనే వెబ్సైటు లో మీ బ్రౌజర్ యొక్క వెర్షన్ చూపించబడుతుంది.అలానే మీ బ్రౌజర్ అప్డేట్ గా వుందో లేదో కూడా Display అవుతుంది.దానిని బట్టి మీరు బ్రౌజర్ ఆప్షన్స్ లోకి వెళ్లి బ్రౌజర్ ను అప్డేట్ చేసుకోవచ్చు.


ఈ మెథడ్ ద్వారా మీరు యూజ్ చేస్తున్న అన్ని బ్రౌజర్లు ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఓల్డ్ వెర్షన్ లో రన్ అవుతున్న బ్రౌజర్స్ ను అప్డేట్ చేసుకోవటం వల్ల ఆన్లైన్ దాడుల నుండి కొంతమేర రక్షణ పొందవచ్చు.


Bonus Tip: మీరు పైన పేర్కొన్న వెబ్సైటు లలో whatismybrowser అనే వెబ్సైటు ద్వారా మీ బ్రౌజర్ కు సంభందించిన మరిన్ని విషయాలు అనగా javascript ఎనేబుల్ లో ఉందా లేదా? ,మీ యొక్క ip address మరియు మీ కంప్యూటర్ స్క్రీన్ డైమెన్షన్స్ మొదలయిన వాటిని తెలుసుకోవచ్చు.



Read Also: విండోస్ 10 Calculator ను ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ లో ఉపయోగించుకోవచ్చు! వివరాలు ఇవి..

Read Also: మీ Windows 10 కంప్యూటర్ లోని గ్రాఫిక్స్ కార్డు మోడల్ మరియు వివరాలను తెలుసుకోవడం ఎలా?


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు