Translate

29, జులై 2019, సోమవారం

ట్విట్టర్ ను మరలా పాత యూజర్ ఇంటర్ఫేస్ తో ఉపయోగించుకోవటం ఎలా?


How to Get Back to Old Interface On Twitter For Web | in Telugu 

 

How to Get Back to Old Interface On Twitter For Web | in Telugu


ట్విట్టర్ కొన్ని రోజుల క్రితం క్రొత్త యూజర్ ఇంటర్ఫేస్ ను ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రొత్త డిజైన్ యూజర్స్ కు చాలా ఉపయోగకరంగా మరియు తేలికగా వుంటుంది అని ట్విట్టర్ అంటుంది. కాని ,ట్విట్టర్ ను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న యూజర్స్ కు ఈ  క్రొత్త ఇంటర్ఫేస్ ఇబ్బందిగా వున్నట్లు తమ ట్వీట్స్ ద్వారా తెలుపుతున్నారు.


కాని, మీరు ట్విట్టర్ ను ఇది వరకు డిజైన్ లోనే ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలుసా? అవును మీరు ట్విట్టర్ ను ఇది వరకు వున్న Interface తో వాడుకోవచ్చు. దీనికి చాలా మార్గాలు వున్నాయి.వాటిలో నేను ఈ ఆర్టికల్ లో ఒక ఈజీ మెథడ్ ను చెప్పబోతున్నాను. ఈ మెథడ్ లో మీరు ఒక ఎక్స్టెన్షన్ ను వుపయోగించి ట్విట్టర్ వెబ్సైటు ను పాత యూజర్ ఇంటర్ఫేస్ తో లోడ్ చేసుకోవచ్చు.ఇది ఎలాగో మనము ఇప్పుడు చూద్దాం.


How to Get Back to Old Interface On Twitter For Web


  • ముందుగా మీరు GoodTwitter అనే Extension / add-on ను మీ క్రోమ్ లేదా Firefox బ్రౌజర్ కు యాడ్ చేసుకోవాలి.

మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వాడుతుంటే ఇక్కడ నుంచి లేదా Firefox బ్రౌజర్ ను వాడుతుంటే ఇక్కడ నుంచి ఈ Extension / add-on పేజీ కు వెళ్లి దీనిని మీ బ్రౌజర్లు కు యాడ్ చేసుకోవచ్చు.

  • తరువాత యధాతధంగా మీరు twitter.com ను ఓపెన్ చెయ్యండి.ఇప్పుడు మీకు ట్విట్టర్ వెబ్సైటు ఇది వరకు వున్న యూజర్ ఇంటర్ఫేస్ తో ఓపెన్ అవుతుంది.

ఇక మీరు ట్విట్టర్ యొక్క క్రొత్త డిజైన్ తో తికమక పడనవసరం లేదు.


ఈ Extension ను ఒక ట్విట్టర్ వినియోగదారుడు  అలానే సాఫ్ట్ వేర్ డెవలపర్ అయిన Zusor అనే వ్యక్తి డెవలప్ చేసాడు.


Zusor చెప్పిన దాని ప్రకారం ఇది మీ ట్విట్టర్ అనలిటిక్స్ ను లేదా ట్విట్టర్ అకౌంట్ కు సంభందించి ఎటువంటి సమాచారాన్ని సేకరించదు.


ట్విట్టర్ క్రొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్ఫేస్ సరిగ్గా అర్ధం కాని వారు ఈ GoodTwitter అనే Extension ను బ్రౌజర్ లకు యాడ్ చేసుకుని ట్విట్టర్ ను పాత డిజైన్ తో ఉపయోగించుకోవచ్చు.



This is all about "How to get back to old interface on Twitter for Web | in Telugu"


Read Also: మీరు వాడుతున్న బ్రౌజర్ Up-to-date గా వుందో, లేదో సింపుల్ గా ఇలా తెలుసుకోండి!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి