విండోస్ 10 లో డెస్క్ టాప్ ఐకాన్స్ ను హైడ్ చెయ్యటం ఎలా?


How to Hide ,Unhide Desktop Icons in Windows 10 | in Telugu


How to Hide ,Unhide Desktop Icons on Windows 10 | in Telugu

కంప్యూటర్ లో సాధారణంగా మనము స్పీడ్ గా యాక్సిస్ చెయ్యటానికి ఫైల్స్ ను,ఫోల్డర్ లను ,ప్రోగ్రామ్స్ ను డెస్క్ టాప్ మీద పెట్టుకుంటాము లేదా వాటి యొక్క షార్ట్ కట్స్ ను డెస్క్ టాప్  మీద క్రియేట్ చేసుకుంటాము.కానీ మీరు ఇలా డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ను పెట్టుకోవటం వల్ల మీరు సెట్ చేసుకున్న డెస్క్ టాప్ బ్యాగ్రౌండ్ సరిగ్గా కనిపించదు.

కొందరు తమ ఫోటో ను మరియు తమకు నచ్చిన High defination పిక్చర్ ను desktop బ్యాగ్రౌండ్  గా పెట్టుకుంటారు.కానీ డెస్క్ టాప్ మీద వున్న ఐకాన్స్ ఆ photo ను కవర్ చేస్తాయి.ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా..?

అయితే మీరు ఏమి ఆలోచించనవసరం లేదు.. ఎందుకంటే నేను ఈ పోస్ట్ లో మీరు సులభంగా desktop icons ను Hide చేసి మరియు చాలా ఈజీ గా unhide ఎలా చేయవచ్చో చెప్తాను.దీనివల్ల మీరు సెట్ చేసుకున్న డెస్క్ టాప్ బాక్రౌండ్ చాలా విశాలంగా కనపడుతుంది మరియు మీకు కావలసినప్పుడు మాత్రమే డెస్క్ టాప్ మీద ఐకాన్స్ కనపడేలా చేసుకోవచ్చు.

Procedure for Hide Desktop Icons in Windows 10


మీరు డెస్క్ టాప్ మీద వున్న ఐకాన్స్ ను హైడ్ చెయ్యాలి అని అనుకుంటే మీరు మౌస్ తో డెస్క్ టాప్ మీద ఖాళీ ప్రదేశం లో రైట్ క్లిక్ ఇవ్వండి.తరువాత View అనే దాని మీద క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీరు show desktop icons అనే దానిని క్లిక్ చేసి అక్కడ వున్న టిక్ మార్క్ ను తొలగించండి.ఇప్పుడు మీ డెస్క్ టాప్ మీద వున్న ఐకాన్స్ మాయమయిపోతాయి.

తరువాత మీకు డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ని తిరిగి పొందాలి అని అనుకుంటే ఇంతకముందు లాగానే డెస్క్ టాప్ మీద ఖాళీ ప్రదేశంలో మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి.తరువాత view మీద క్లిక్ చేసి show desktop icons అనే దాని మీద క్లిక్ చేసి మార్క్ చెయ్యండి.


ఇలా మీరు డెస్క్ టాప్ మీద వున్న ఐకాన్స్ ను హైడ్ చేసి ఈజీ గా అన్ హైడ్ చేసుకోవచ్చు.దీని ద్వారా మీరు పెట్టుకున్న బ్యాగ్రౌండ్  ను మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు.


Read Also: మీ Windows 10 కంప్యూటర్ లోని గ్రాఫిక్స్ కార్డు మోడల్ మరియు వివరాలను తెలుసుకోవడం ఎలా?


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా Active Amaravati ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు