Translate

22, జులై 2019, సోమవారం

ఫేస్ బుక్ అప్లికేషన్ లో నోటిఫికేషన్ డాట్స్ ను ఆఫ్ చేయటం ఎలా? (Android)



How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu 

How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu


మనము ఫేస్ బుక్ అప్లికేషన్ ను వాడే సమయంలో ఫేస్ బుక్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ లో సంభందిత షార్ట్ కట్ ఐకాన్స్ మీద రెడ్ లేదా బ్లూ కలర్ లో డాట్స్ ను మరియు నంబర్స్ ను చూసే వుంటారు. ఇవి సంభందిత ఐకాన్స్ యొక్క నోటిఫికేషన్స్ ను తెలియచేస్తాయి.కాని వీటి వల్ల వినియోగదారులు కొంత ఆందోళనకు గురి అయ్యే అవకాశం వుంది.


దీనిని దృష్టిలో వుంచుకుని ఫేస్ బుక్ ఈ నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేసే విధంగా ఒక ఆప్షన్ ను తీసుకువచ్చింది.ఈ ఫీచర్ తో మీరు ఈజీ గా ఈ నోటిఫికేషన్ డాట్స్ ను కనపడకుండా చెయ్యొచ్చు.ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.



Procedure for Turn Off Notification Dots on Facebook


  • ముందుగా మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత మీరు ఫేస్ బుక్ నావిగేషన్ ప్యానల్ లో వున్న Humburger ఐకాన్ ను ప్రెస్ చెయ్యండి.
  • ఇప్పుడు పేజి ను స్క్రోల్ చేసి Settings & Privacy అనే దాని మీద క్లిక్ చేసి మరలా Settings మీద క్లిక్ చెయ్యండి.

How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu

  • తరువాత పేజి ను స్క్రోల్ చేసి Notifications అనే సెక్షన్ లో వున్న Notification Dots అనే ఆప్షన్ ను టాప్ చెయ్యండి.

How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu

  • ఇప్పుడు మీరు ఈ క్రింది స్క్రీన్ షాట్ లో వున్న ఆప్షన్స్ ను చూస్తారు.మీరు ఏ ఐకాన్స్ కు సంభందించిన నోటిఫికేషన్ డాట్స్ ను పొందకూడదు అని అనుకుంటున్నారో వాటి ఎదురుగా వున్న toggle ను ఈ క్రింది విధంగా జరిపి ఆఫ్ చెయ్యండి.

How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu


ఇలా మీరు ఫేస్ బుక్ లో నోటిఫికేషన్ డాట్స్ ను ఆఫ్ చేసుకుని కొంతవరకు anxiety ను తగ్గించుకోవచ్చు.


ఫేస్ బుక్ మాత్రమే కాదు చాలా సోషల్ మీడియా సైట్స్ మన యొక్క మానసిక స్థితి మీద కొంత వరకు ప్రభావాన్ని చూపుతున్నాయి అని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి వీటిని ఎంత తక్కువ వాడుకుంటే మనకు అంత మేలు చేకూరుతుంది.

మీరు రోజులో ఫేస్ బుక్ కు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఈ క్రింద కామెంట్ చెయ్యండి.


This is all about "How to Turn Off Notification Dots on Facebook For Android | in Telugu"






Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి