Translate

2, జులై 2019, మంగళవారం

Huawei MediaPad T5 టాబ్లెట్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి...

Huawei MediaPad T5 with Kirin 659 SoC Launched in India: Price and Specifications [ in Telugu ]

Huawei MediaPad T5 with Kirin 659 SoC Launched in India: Price and Specifications [ in Telugu ]


Huawei సోమవారం ఇండియాలో MediaPad T5 అనే క్రొత్త టాబ్లెట్ ను లాంచ్ చేసింది.ఈ టాబ్లెట్ ప్రత్యేకతలు చూసుకుంటే ఇది 10.1 అంగుళాల FHD తెరతో octa-core ప్రాసెసర్ ,డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ,ఆండ్రాయిడ్ 8 Oreo ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.ఇక ఈ టాబ్లెట్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ మీరు ఈ క్రింద చదవవచ్చు.


Huawei MediaPad T5 Price:


Huawei MediaPad T5 ధర ఇండియాలో 2GB+16GB వేరియంట్ Rs.14,990 గా సెట్ చేశారు మరియు 3GB+32GB వేరియంట్ టాబ్లెట్ Rs.16,990 వద్ద లభిస్తుంది.ఈ క్రొత్త టాబ్లెట్ July 10 నుంచి అమెజాన్ ఇండియా ద్వారా లభిస్తుంది.ఈ టాబ్లెట్ బ్లాక్ కలర్ వేరియంట్ లో లభిస్తుంది.


Huawei MediaPad T5 Specifications:


ఈ టాబ్లెట్ స్పెసిఫికేషన్స్ ను చూస్తే Huawei MediaPad T5 ఆండ్రాయిడ్ 8 ఆపరేటింగ్ సిస్టం తో EMUI 8 తో నడుస్తుంది.ఈ టాబ్లెట్ 10.1 అంగుళాల FHD (1920 x 1200 pixels) Vivid తెరతో, 16:10 aspect రేషియో తో వస్తుంది.ఈ టాబ్లెట్ octa-core HiSilicon Kirin 659 SoC తో వస్తుంది.


ముందుగా చెప్పుకున్నట్లు గానే ఈ టాబ్లెట్ 2GB RAM+16GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు
3GB RAM+32GB ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్ లలో లభిస్తుంది.మీరు స్టోరేజ్ ను 256GB వరకు microSD స్లాట్ ద్వారా కూడా పెంచుకోవచ్చు.దీనిని 5,100mAh బ్యాటరీ తో ప్యాక్ చేశారు.


మిగిలిన స్పెసిఫికేషన్స్ చూస్తే దీనిలో వెనుక భాగాన 5-మెగాపిక్సల్ మరియు ముందు భాగాన
2-మెగాపిక్సల్ కెమెరా ను ఉపయోగించారు.దీనిలో రెండు స్టీరియో స్పీకర్స్ ను పొందుపరిచారు.వీటిలో Huawei histen సౌండ్ టెక్నాలజీ ని ఉపయోగించారు.కనెక్టివిటీ పరంగా దీనిలో Wi-Fi 802.11ac ,4G LTE, GPS ,Micro-USB పోర్ట్ మొదలయినవి వున్నాయి.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి