Translate

19, జులై 2019, శుక్రవారం

Mi Neckband Bluetooth Earphones ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్

Mi Neckband Bluetooth Earphones Price and Specifications | in Telugu



Mi Neckband Bluetooth Earphones Price and Specifications | in Telugu
image credits: mi.com


Xiaomi  కంపెనీ July 17 న ఇండియా లో Redmi K20 మరియు Redmi K20 Pro లతో పాటు Mi Neckband Bluetooth Earphones ను కూడా లాంచ్ చేసింది.ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ధరను ఇండియా లో ప్రస్తుతం Rs.1,599 వద్ద సెట్ చేశారు.వినియోగదారులు ఈ ఇయర్ ఫోన్స్ ను జూలై 23 నుంచి Flipkart మరియు Mi.com ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.


ఈ ప్రైస్ ట్యాగ్ లో Xiaomi ఈ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ లో ప్రత్యేకమయిన ఫీచర్స్ ను పొందుపరిచింది.ఈ ఇయర్ ఫోన్స్ లేటెస్ట్ Bluetooth v5.0 తో వస్తున్నాయి.కాబట్టి వీటిలో pairing సమస్యలు సాధారణంగా రాకపోవచ్చు.ఇవి HFP ,A2DP ,HSP, AVRCP వంటి బ్లూ టూత్ ప్రోటోకాల్స్ ను సపోర్ట్ చేస్తాయి.


ఇంకా ఇవి డైనమిక్ బేస్ తో మరియు ట్రై బ్యాండ్ equalization తో వస్తున్నాయి.Xiaomi చెప్పిన దాన్ని బట్టి ఈ Bluetooth ఇయర్ ఫోన్స్ 8 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి వుంటాయి.అనగా ఇవి ఒక ఫుల్ సింగిల్ ఛార్జ్ తో 8 గంటల బ్యాటరీ ను ఇవ్వగలవు.


దీన్ని పూర్తిగా 0 నుండి 100 వరకు ఛార్జ్ చెయ్యటానికి 2 గంటల సమయం పడుతుంది.అలానే ఈ నెక్ బ్యాండ్ యొక్క బరువు కేవలం 13.6 గ్రాములుగా వున్నట్లు తెలుస్తుంది.


Mi Neckband Bluetooth Earphones Price and Specifications | in Telugu
image credits: mi.com


దీనిలో 120mAh Lithium-ion polymer బ్యాటరీ ను వాడారు.ఈ Mi Neckband Bluetooth Earphones వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తున్నాయి.

ఈ ఇయర్ ఫోన్స్ Micro-Arc Collar డిజైన్ తో మెడకు సరిగ్గా సెట్ అయ్యే విధంగా మరియు చర్మానికి హాని కలుగని మెటీరియల్ తో వస్తున్నాయి.

Xiaomi విడుదల చేసే ప్రొడక్ట్ లను చూస్తుంటే ఈ కంపెనీ ఆడియో బిజినెస్ లోకి అడుగు పెడుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.

ఇందులో భాగంగానే  Xiaomi కొన్ని రోజుల ముందు Mi Super Bass Wireless Headphones ను Rs.1,799 వద్ద విడుదల చేసింది.ఈ  Headphones ప్రస్తుతం mi.com మరియు అమెజాన్ ద్వారా లభిస్తున్నాయి.


కేవలం ఆడియో ప్రొడక్ట్స్ మరియు మొబైల్స్ మాత్రమే కాకుండా Xiaomi వివిధ కేటగిరీ లకు సంభందించిన ప్రొడక్ట్స్ అనగా పవర్ బ్యాంకులు ,ఎయిర్ ప్యూరీఫైర్ లు ,ట్రిమ్మర్ లు వంటి అనేక ప్రొడక్ట్ లను ప్రజలకు సరసమయిన ధరలలో అందిస్తూ వ్యాపార రంగంలో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది.


This is about "Mi Neckband Bluetooth Earphones Price and Specifications | in Telugu"


Read Also: ఫేస్ బుక్ లో మీరు పంపిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లలో పెండింగ్ లో వున్న వాటిని చూడటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి