Translate

24, జులై 2019, బుధవారం

Netflix ఇప్పుడు నెలకు కేవలం రూ.199 లకే..! పూర్తి వివరాలు ఇవి..


Netflix Launched New Mobile Plan In India at Rs.199 per month.Here's all Details | in Telugu


Netflix Launched New Mobile Plan In India at Rs.199 per month.Here's all Details | in Telugu


Netflix బుధవారం నాడు ఇండియాలో ఒక క్రొత్త ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా ఇండియన్ యూజర్స్ కేవలం నెలకు Rs.199 చెల్లించి Netflix ను ఆనందించవచ్చు.


ఎన్నో రోజులుగా ఇండియన్ యూజర్స్ కు అతి తక్కువ ధరలో ఒక క్రొత్త Netflix ప్లాన్ రాబోతుంది అని సమాచారం అందుతూనే వుంది.కానీ Netflix ఇంత తక్కువ ధరలో ప్లాన్ ను తీసుకువస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.


ఇప్పటి వరకు వున్న Netflix ప్లాన్స్ లో ఈ ప్లాన్ ధర చాలా తక్కువ.కనుక ఈ ప్లాన్ కి కొన్ని లిమిటేషన్లు వున్నాయి.అవి ఏంటంటే..

మీరు ఈ ప్లాన్ తో ఈ Netflix లోని షో లను మీ TV లో casting చెయ్యలేరు.మీరు ఈ ప్లాన్ ద్వారా ఒకే సమయంలో కేవలం ఒకే డివైస్ లో స్ట్రీమింగ్ చెయ్యటానికి మాత్రమే అవకాశం వుంది.ఇంకా మీరు ఈ ప్లాన్ తో కేవలం SD క్వాలిటీ తో మాత్రమే వీడియో లను చూడగలరు.
అలానే మీరు ఈ ప్లాన్ తో Netflix ను మీ మొబైల్ లేదా టాబ్లెట్ డివైస్ లలో మాత్రమే వినియోగించుకోగలరు.

ఏది ఏమయినా కూడా ఈ ధరలో Netflix ను పొందవచ్చు అంటే కొంత వరకు మంచి విషయమే అని చెప్పుకోవాలి.ప్రస్తుతానికి ఇండియాలో Netflix ఈ రూ.199 రూపాయల (మొబైల్) ప్లాన్ తో పాటు రూ.499 (బేసిక్),రూ. 649 (స్టాండర్డ్), రూ. 799 (ప్రీమియం) ప్లాన్స్ ను అందిస్తుంది.

ఇప్పటికే amazon కేవలం నెలకు రూ.129 కే ప్రైమ్ సుబ్స్క్రిప్షన్ ను ఇండియాలో అందిస్తుంది.

ఈ క్రొత్త రూ.199 ల ప్లాన్ తో మధ్యతరగతి వారు కూడా Netflix ను ఉపయోగించుకుని వివిధ TV షో లను,మూవీ లను అలానే వెబ్ సిరీస్ లను SD క్వాలిటీ లో వారి మొబైల్స్ లేదా టాబ్లెట్ డివైస్ లలో చూడవచ్చు.


భారతదేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు మొబైల్ లో Netflix ను వాడటం మరియు Netflix ధరలు అధికంగా ఉండటం ఈ క్రొత్త ప్లాన్ ను తీసుకురావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.


This is all about "Details about Netflix's New Mobile Plan in India"


Read Also: ఫేస్ బుక్ లో మీరు పంపిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లలో పెండింగ్ లో వున్న వాటిని చూడటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి