Nokia 9 PureView ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..


Nokia 9 PureView Launched in India: Price and Specifications | in Telugu




Nokia 9 PureView Launched in India: Price and Specifications | in Telugu
Image Source: Nokia.com



HMD Global ఈ రోజు ఇండియా లో Nokia 9 PureView ను లాంచ్ చేసింది.దీనిలో వెనుక వైపున 5 కెమెరాలను ఏర్పాటు చెయ్యటం ఒక క్రొత్త మరియు ప్రత్యేకమయిన ఫీచర్ అని చెప్పుకోవచ్చు.ఇదే కాకుండా దీనిలో Under Screen ఫింగర్ ప్రింట్ సెన్సార్,Wireless ఛార్జింగ్  లాంటి ప్రత్యేకమయిన ఫీచర్స్ వున్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.


Nokia 9 PureView Price


Nokia 9 PureView ఇండియా లో Rs.49,999 కు లభిస్తుంది.ఇది Midnight blue కలర్ వేరియంట్ లో వస్తుంది.ఈ ఫోన్ ను కొనుగోలు దారులు ఈ రోజు నుంచి Nokia/phones సైట్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.ఈ ఫోన్ త్వరలో Flipkart మరియు ప్రముఖ Offline స్టోర్స్ లలో లభించవచ్చు.

ఈ Nokia 9 PureView ను నోకియా Official ఆన్లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేసే వారికి PUREVIEW అనే ప్రోమో కోడ్ ఎంటర్ చెయ్యటం ద్వారా లిమిటెడ్ టైం ఆఫర్ క్రింద నోకియా Rs.5,000 విలువగల గిఫ్ట్ కార్డు ను మరియు Nokia 705 ఇయర్ బడ్స్ ను కూడా ఫ్రీ గా అందిస్తుంది.


Nokia 9 PureView Specifications


Nokia 9 PureView స్పెసిఫికేషన్స్ చూసినట్లు అయితే ఇది 5.99 అంగుళాల QHD 2K pOLED స్క్రీన్ తో,PureDisplay టెక్నాలజీ తో,18.5:9 aspect రేషియో మరియు in-display ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం మీద నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రాం లో భాగంగా వుంది.దీనిలో Snapdragon Qualcomm 845 SoC ను ఉపయోగించారు.ఇది 6GB RAM తో 128GB ఇంటర్నల్ మెమరీ తో వస్తుంది.


కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 12-megapixel కెమెరాలు మొత్తం 5 వున్నాయి.వీటిలో మూడు Monochrome సెన్సార్స్ కాగా మిగిలినవి RGB సెన్సార్లు.ఈ Nokia 9 PureView ఫోన్ ముందు భాగాన 20-megapixel సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు.దీనిని 3,320mAh బ్యాటరీ తో ప్యాక్ చేసారు.ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా దీనిలో Wi-Fi 802.11ac ,Bluetooth 5.0,NFC,GPS/A-GPS లాంటివి వున్నాయి.ఇది Qi వైర్ లెస్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.ఈ Nokia PureView USB Type-C పోర్ట్ తో వస్తుంది.దీనిలో 3.5mm జాక్ లేకపోవటం గమనార్హం.


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా Active Amaravati ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు