Translate

4, జులై 2019, గురువారం

Redmi 7A ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ యివి.


Redmi 7A Smart Phone Launched in India: Price and Specifications

Redmi 7A Smart Phone Launched in India: Price and Specifications
ఈరోజు ఎట్టకేలకు Redmi 7A ఫోన్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ఈ క్రొత్త Redmi 7A ఫోన్ జూలై 11 నుంచి లభించనున్నది.HD+ Display,Octa-core Snapdragon 439 SoC,32GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లోని కొన్ని ముఖ్యమయిన ఫీచర్స్ గా చెప్పుకోవచ్చు.

Redmi 7A Price:


Redmi 7A ఇండియా లో 2GB+16GB వేరియంట్ Rs.5,999 వద్ద మరియు 2GB+32GB వేరియంట్ Rs.6,199 వద్ద లభిస్తుంది.ఈ ఫోన్ Matte Black,Matte Blue ,Matte Gold అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Introductory ఆఫర్ క్రింద ఈ ఫోన్ మీద 200 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది.ఈ తగ్గింపు ఈ ఫోన్ ను జులై నెలలో కొన్నవారికి మాత్రమే వరిస్తుంది.

Redmi 7A సేల్ July 11 నుండి Flipkart, Mi.com మరియు Mi Home స్టోర్స్ ద్వారా జరుగుతుంది.ఆ తర్వాత ఈ ఫోన్ offline స్టోర్స్ లలో లభించే అవకాశాలు వున్నాయి.ఈ ఫోన్ మీద ప్రత్యేకంగా భారతీయులకు 2 సంవత్సరాల వారెంటీ కూడా లభిస్తుంది.


Redmi 7A Specifications:


Redmi 7A ఫోన్ 5.45 అంగుళాల HD+ తెరతో (720 x 1440 pixels) ,18:9 aspect రేషియో తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం తో MIUI 10 మీద నడుస్తుంది.దీనిలో octa-core Snapdragon 439 SoC ను మరియు Andreno 505 GPU ను ఉపయోగించారు.


కెమెరా పరంగా దీనిలో వెనుకభాగాన 12-megapixel Sony IMX486 సెన్సార్ ను ,ముందు భాగాన 5-megapixel కెమెరా ను అమర్చారు.ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా AI ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ Redmi 7A ముందు చెప్పుకున్నట్లు గానే 2GB RAM +16GB ఇంటర్నల్  స్టోరేజ్,
2GB RAM + 32GB ఇంటర్నల్  స్టోరేజ్ అనే రెండు వేరియంట్ లలో వస్తుంది.మీరు microSD స్లాట్ ద్వారా 256GB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ ను చూస్తే దీనిలో 4G VoLTE ,Wi-Fi 802.11 b/g/n ,Bluetooth 4.2 ,GPS /A - GPS,  Wireless FM radio, Micro-USB మరియు 3.5mm జాక్ మొదలయినవి వున్నాయి.ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 10W ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి