Translate

17, జులై 2019, బుధవారం

Redmi K20 మరియు Redmi K20 Pro ఇండియా లో లాంచ్ అయ్యాయి.ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవి..


Redmi K20 ,Redmi K20 Pro Launched in India: Price and Specifications | in Telugu


Redmi K20 ,Redmi K20 Pro Launched in India: Price and Specifications | in Telugu
Image Source: Xiaomi website


ఎన్నో రోజుల నుంచి Xiaomi ఫాన్స్ ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది! Xiaomi ఎట్టకేలకు Redmi K20 మరియు Redmi K20 Pro లను ఇండియా లో ఈరోజు లాంచ్ చేసింది.ఈ స్మార్ట్ ఫోన్స్ Full HD+ తెరతో, పాప్ అప్ కెమెరా,in-display ఫింగర్ ప్రింట్ సెన్సార్,వెనుక భాగాన ట్రిపుల్ కెమెరా సెటప్ ,ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకమయిన ఫీచర్స్ తో వస్తున్నాయి.మీరు Redmi K20,Redmi K20 Pro యొక్క ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను ఈ క్రింద చదవవచ్చు.


Redmi K20 and Redmi K20 Price in India


Redmi K20 స్మార్ట్ ఫోన్ ఇండియా లో 6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.21,999 వద్ద,6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.23,999 వద్ద లభిస్తుంది.

Redmi K20 Pro ఇండియా లో 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.27,999 దగ్గర మరియు 8GB RAM +256GB స్టోరేజ్ ధర Rs.30,999 దగ్గర లభిస్తుంది.

ఈ మొబైల్స్ Carbon Black, Flame Red, మరియు Glacier Blue అనే మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తున్నాయి.


Redmi K20 మరియు K20 Pro యొక్క మొదటి సేల్ July 22 న Flipkart ,Mi.com మరియు Mi Home స్టోర్ లలో జరుగుతుంది.ఈ ఫోన్ యొక్క Alpha sale లో పాల్గొన్న వినియోగదారులు Redmi K20,Redmi K20 Pro లను ఈ రోజు రాత్రి 8 గంటల నుండి Flipkart మరియు Mi.com ద్వారా పొందవచ్చు.


Redmi K20 Specifications


Redmi K20 స్మార్ట్ ఫోన్ 6.39 అంగుళాల Full HD+ (1080 x 2340 pixels) AMOLED తెరతో,19.5:9 aspect ratio తో, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ,91.9 screen-to-body రేషియో , in-display ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం తో MIUI 10 మీద నడుస్తుంది.ఈ Redmi K20 లో Snapdragon 730 SoC ను  ఉపయోగించారు.

కెమెరా పరంగా చూసుకుంటే దీనిలో వెనుక భాగాన 48MP(ప్రైమరీ కెమెరా) +13MP (అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా )+8MP (టెలీఫోటో కెమెరా) ట్రిపుల్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.ముందు భాగాన 20 MP పాప్ అప్ సెల్ఫీ కెమెరా ను అమర్చారు.

ముందు చెప్పుకున్నట్లు గానే Redmi K20 స్మార్ట్ ఫోన్ 6GB/64GB మరియు 6GB/128GB వేరియంట్ లలో లభిస్తుంది.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE,Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/A-GPS ,USB Type-C, 3.5mm జాక్ మొదలయినవి వున్నాయి.

Redmi K20 స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.



Redmi K20 Pro Specifications


Redmi K20 Pro కూడా 6.39 అంగుళాల Full HD+ (1080 x 2340 pixels) AMOLED తెరతో,19.5:9 aspect రేషియో తో , గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.ఇది DC dimming ఫీచర్ ను కూడా కలిగి వుంది.దీనిలో కూడా in-display ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను గమనించవచ్చు.

ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం తో MIUI 10 మీద నడుస్తుంది.ఈ Redmi K20 Pro లో Snapdragon 855 SoC ను ఉపయోగించారు.


కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 48MP ( ప్రైమరీ కెమెరా ) +8MP (టెలీఫోటో కెమెరా) +13MP (అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ) ట్రిపుల్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.కానీ దీనిలో K20 లో లాగా Sony IMX582 సెన్సార్ ను కాకుండా Sony IMX586 కెమెరా సెన్సార్ ను ఉపయోగించారు.

ఇక Redmi K20 లో ఉన్నట్లు గానే దీని ముందు భాగాన 20-megapixel పాప్ అప్ సెల్ఫీ కెమెరా ను ఉపయోగించారు.Redmi K20 Pro 6GB/128GB మరియు 8GB/256GB వేరియంట్ లలో వస్తుంది.


గేమింగ్ కు అనుకూలంగా వుండే విధంగా దీనిలో చాలా ప్రత్యేకమయిన హార్డ్ వేర్ విభాగాన్ని పొందుపరిచారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi 802.11ac ,Bluetooth v5,0 ,GPS/A-GPS,USB Type-C, 3.5mm జాక్ మొదలయినవి వున్నాయి.

Redmi K20 Pro స్మార్ట్ ఫోన్ 4000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.


This is all about "Redmi K20 and Redmi K20 Pro Price and Specifications | in Telugu"



Read Also: ఫేస్ బుక్ లో మీరు పంపిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లలో పెండింగ్ లో వున్న వాటిని చూడటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి