Translate

31, ఆగస్టు 2019, శనివారం

జనరల్ నాలెడ్జి -21

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. న్యూట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త?

జ. జేమ్స్ చాడ్విక్


ప్రశ్న. మానవ శరీరంలోని అతి చిన్న ఎముక ఏది?

జ. కర్ణాంతరాస్థి (Stapes) 


ప్రశ్న. భగవద్గీత ను మొట్టమొదట ఇంగ్లీష్ లోకి ఎవరు అనువదించారు?

జ. చార్లెస్ విల్కిన్స్


ప్రశ్న. 'రసాయనాల రారాజు' అని దేనికి పేరు?

జ. సల్ఫ్యూరిక్ ఆమ్లం


ప్రశ్న. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ. ఆస్టియాలజీ


ప్రశ్న. ఇండియా లో ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న ఎవరి యొక్క పుట్టినరోజును నేషనల్ స్పోర్ట్స్ డే గా జరుపుకుంటారు?

జ. ధ్యాన్ చంద్



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. BASIC ను విస్తరించుము.

జ. Beginner's All-purpose Symbolic Instruction Code


ప్రశ్న. మొట్టమొదటి గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్.

జ.  Mosaic


ప్రశ్న. E-Mail పూర్తి నామము.

జ. Electronic Mail



Over to you:

హిమోగ్లోబిన్ లో వుండే  లోహం ఏంటి?

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -20



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

1 వ్యాఖ్య: