Translate

12, ఆగస్టు 2019, సోమవారం

విండోస్ 10 లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ను మార్చటం ఎలా?

How To Change Default Browser In Windows 10 | in Telugu 


మనము విండోస్ 10 లో ఏదయినా ఫైల్ ను ఓపెన్ చేసినప్పుడు అది దానికి సంభందించిన  అప్లికేషన్ లో ఓపెన్ అవుతుంది.ఉదాహరణకు మనము ఒక html ఫైల్ ను కానీ లేదా లింక్ ను కానీ క్లిక్ చేసినప్పుడు అది మీ విండోస్ కంప్యూటర్ లో డిఫాల్ట్ గా సెట్ చెయ్యబడి వున్న వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది.


కానీ విండోస్ 10 లో డిఫాల్ట్ బ్రౌజర్ గా Edge బ్రౌజర్ ఓపెన్ అవుతుంది.క్రోమ్ బ్రౌజర్ కు మరియు Firefox వంటి బ్రౌజర్ కు అలవాటు అయినవారికి edge బ్రౌజర్ కొంచం ఇబ్బందిగా ఉంటుంది.నిజం చెప్పాలి అంటే నేను కూడా నా PC లో ఎక్కువగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతూ వుంటాను.

ఇలా మీరు బ్రౌజర్ కు సంభందించి ఏదయినా లింక్ ను లేదా టాస్క్ ను ట్రిగ్గర్ చేసినప్పుడు డిఫాల్ట్ గా Edge బ్రౌజర్ ఓపెన్ అవుతుంది .ఇలా డిఫాల్ట్ గా Edge బ్రౌజర్ కాకుండా మీకు నచ్చిన బ్రౌజర్ ను ఓపెన్ అయ్యేలా చెయ్యాలి అంటే మీరు మీకు నచ్చిన బ్రౌజర్ ను డిఫాల్ట్ బ్రౌజర్ గా సెట్ చేసుకోవాలి.

కాబట్టి, ఇప్పుడు మనము విండోస్ 10 కంప్యూటర్ లో డిఫాల్ట్ బ్రౌజర్ ను ఎలా మార్చవచ్చో తెలుసుకుందాం.


Procedure For Changing Default Browser In Windows 10 PC | in Telugu 



  • మొదటగా మీరు టాస్క్ బార్ లో వున్న సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి లేదా Win+S ను ప్రెస్ చేసి సెర్చ్ బార్  ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత సెర్చ్ బార్ లో default అని టైపు చేసి తరువాత వచ్చే రిజల్ట్స్ లో Default apps అనే దాని మీద క్లిక్ చెయ్యండి.

How To Change Default Browser In Windows 10 | in Telugu

  • ఇప్పుడు ఓపెన్ అయ్యే విండో లో Web Browser అనే చోట ఇప్పటికే డిఫాల్ట్ బ్రౌజర్ గా వున్న బ్రౌజర్ మీద క్లిక్ చెయ్యండి.


  • తరువాత Choose an app అనే పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.మీరు ఆ పాప్ అప్ విండో లో వున్న బ్రౌజర్లు లో మీకు నచ్చిన బ్రౌజర్ పై క్లిక్ చెయ్యండి.



నోట్: మీరు కనుక డిఫాల్ట్ బ్రౌజర్ ను మొదటి సారి మార్చుతుంటే మీరు వేరే బ్రౌజర్ ను సెలెక్ట్ చెయ్యగానే ఒక చిన్న పాప్ అప్ వస్తుంది.ఇలాంటి సందర్భం లో మీరు ఆ పాప్ అప్ లో వున్న switch anyway అనే దానిని ప్రెస్ చేయండి.

ఇక మీరు ఎప్పుడైనా బ్రౌజర్ కు సంభందించిన టాస్క్ ను ఓపెన్ చేసినట్లు అయితే ఆ టాస్క్ మీరు సెట్ చేసుకున్న బ్రౌజర్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.


ఇలా మీరు విండోస్ 10 కంప్యూటర్ లో మీకు నచ్చిన బ్రౌజర్ ను డిఫాల్ట్ బ్రౌజర్ గా సెట్ చేసుకోవచ్చు.

This is all about "How To Change Default Browser In Windows 10 | in Telugu"


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


ఈ పోస్ట్ మీకు నచ్చితే ఈ క్రింది బటన్స్ ద్వారా  ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి