Translate

24, ఆగస్టు 2019, శనివారం

విండోస్ 10 లో ఫోటోలను PDF రూపంలోకి మార్చుకోవటం ఎలా?

How to Convert Images to PDF Without Internet and Third Party Application (Windows 10) | in Telugu



How to Convert Images to PDF Without Internet and Third Party Application (Windows 10)


మనకు ఒక్కొక్కసారి ఫోటోలను PDF రూపంలోకి మార్చే అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనము వివిధ వెబ్సైట్స్ ను సందర్శించి ఫోటోలను PDF లోకి మార్చుకుంటాము. కాని ఈ మెథడ్ కు ఇంటర్నెట్ అవసరం వుంటుంది.

కానీ మనము ఎటువంటి అప్లికేషన్స్ ను ఇన్స్టాల్ చేసుకోకుండా విండోస్ 10 లో కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలను PDF Format లోకి ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Procedure For Converting Images to PDF in Windows 10


  • ముందుగా మీరు PDF లోకి మార్చాలి అని అనుకున్న ఫోటో లను మౌస్ తో సెలెక్ట్ చేసుకుని, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలలో ఏదో ఒకదానిమీద మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి.
  • తరువాత ఈ క్రింది చూపించబడిన Print అనే దాని మీద మౌస్ తో క్లిక్ చెయ్యండి.


  • తరువాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది.
  • దానిలో ఈ క్రింద చూపించబడిన విధంగా Printer అనే చోట Microsoft print to PDF అనే దానిని సెలెక్ట్ చేసుకోండి.
Paper size ను మరియు వివిధ ఆప్షన్స్ ను మీ అవసరాన్ని బట్టి మార్చుకోండి.అలాగే  Fit to screen అనే దానిని కూడా మీ అవసరాన్ని బట్టి సెట్ చేసుకోండి.

  • మీరు ఇలా అన్ని ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత, విండో క్రింది భాగాన వున్న Print అనే దాని మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీకు సేవింగ్ విండో ఓపెన్ అవుతుంది.దానిలో మీరు మీకు నచ్చిన పేరును టైపు చేసి ,ఎక్కడ సేవ్ చెయ్యదలుచుకున్నారో ఎంచుకుని Save మీద క్లిక్ చెయ్యండి.

తరువాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ PDF రూపంలోకి convert చెయ్యబడతాయి.

ఇలా మీరు ఎటువంటి అప్లికేషన్స్ లేదా ఇంటర్నెట్ లేకుండా విండోస్ 10 కంప్యూటర్ ద్వారా ఫోటోలను PDF రూపంలోకి మార్చుకోవచ్చు.


This is all about "How to Convert Images to PDF Without Internet and Third Party Application (Windows 10) | in Telugu"


Read Also: మీ విండోస్ 10 కంప్యూటర్ ను అత్యంత వేగంగా షట్ డౌన్ చేసే విధానం కొరకు ఈ పోస్ట్ చదవండి.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి