Translate

16, ఆగస్టు 2019, శుక్రవారం

JioTV అప్లికేషన్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చెయ్యటం ఎలా? (ఆండ్రాయిడ్)

JioTV For Android Gets Dark Mode Feature With 5.8.0 Update: Here's How To Enable It



JioTV For Android Gets Dark Mode Feature With 5.8.0 Update: Here's Is How To Enable It

Reliance Jio తన అప్లికేషన్స్ లో ఒకటి అయిన JioTV అప్లికేషన్ లో ఎప్పటి నుంచో అందరూ ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ ను విడుదల చేసింది.ఈ క్రొత్త డార్క్ మోడ్ ఫీచర్  JioTV 5.8.0 ఆండ్రాయిడ్ అప్డేట్ లో లభిస్తుంది.

ప్రస్తుతం ఈ డార్క్ మోడ్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్ కు మాత్రమే లభిస్తుంది.
మీరు ఈ డార్క్ మోడ్ ఫీచర్ ను JioTV అప్లికేషన్ లో పొందాలి అనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.


Read Also: HTC Wildfire X స్మార్ట్ ఫోన్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి...

How To Enable Dark Mode In JioTV For Android | in Telugu 


  • మొదటగా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి JioTV అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • తరువాత అప్డేట్ చేసుకున్న JioTV అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యండి.
NOTE: మీరు JioTV అప్లికేషన్ ను అప్డేట్ చేసి ఓపెన్ చెయ్యగానే మీకు అప్లికేషన్ క్రింది భాగాన డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసే ఆప్షన్ కనపడుతుంది.మీరు ఒకవేళ దానిని మిస్ అయి ఉంటే ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవడం ద్వారా డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు JioTV అప్లికేషన్ లోని ఎడమ ప్రక్కన పై భాగాన వున్న hamburger ఐకాన్ ను క్లిక్ చేసి Settings అనే దాని మీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత Settings లోని Dark Mode అనే దాని ప్రక్కన వున్న toggle ను జరిపి ఆన్ చెయ్యండి.

ఇలా మీరు JioTV అప్లికేషన్ లో Dark Mode ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

ఈ డార్క్ మోడ్  ఫీచర్ ఈ ఒక్క JioTV లోనే కాదు దాదాపు చాలా అప్లికేషన్స్ లలో లభిస్తుంది.వాట్సాప్ కూడా ఈ డార్క్ మోడ్ ఫీచర్ ను తన మెసెంజర్ లో డెవలప్ చేస్తుంది.

డార్క్ మోడ్ వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్ డెవలపర్స్  ఆండ్రాయిడ్ ,విండోస్ మరియు iOS అప్లికేషన్స్ లలో డార్క్ మోడ్ ఫీచర్ ను డెవలప్ చేస్తున్నారు.

ఈ మధ్య వచ్చే ఆపరేటింగ్ సిస్టం లలో కూడా  సిస్టం వైడ్ డార్క్ మోడ్ ను అందిస్తున్నారు అని అంటే ఈ ఫీచర్ కు వున్న డిమాండ్ మరియు ఈ ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాలను మనం అర్ధం చేసుకోవచ్చు.

కొన్ని రోజుల క్రితం JioTV ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో PiP Mode (Picture-in-Picture Mode) ను కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.దీని ద్వారా మనము JioTV కంటెంట్ ను వేరే అప్లికేషన్స్ ను ఉపయోగిస్తూ కూడా చూడవచ్చు.కానీ ఈ PiP మోడ్ కేవలం ఆండ్రాయిడ్ 8.0 మరియు ఆపైన రన్ అవుతున్న డివైస్ లలో మాత్రమే లభిస్తుంది.


This is all about "How to enable dark mode in JioTV for android | in Telugu"


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లు ఐతే ఈ క్రింది బటన్స్ ను క్లిక్ చేసి ఈ పోస్ట్ ను ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో షేర్ చెయ్యగలరు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి