Translate

25, ఆగస్టు 2019, ఆదివారం

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో Text/Font సైజు ను పెంచుకోవటం ఎలా?

How To Increase Font Size In Google Chrome For Android, Windows | in Telugu 


Read in: English




గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అందరికీ తెలిసిన మరియు అన్ని బ్రౌజర్‌లలో చాలా ప్రొడక్టివిటీ కలిగిన బ్రౌజర్‌. Incognito మరియు Find in the page లాంటి ఎన్నో ఫీచర్స్ తో పాటు ఇది సెక్యూరిటీ మరియు ప్రైవసీ పరంగా కూడా మొదటి స్థానంలో నిలిచింది.


ఇది ఇలా ఉండగా కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు టెక్స్ట్‌ ను సులభంగా చూడటానికి అనుకూలమైన మార్గం కోసం గూగుల్ క్రోమ్‌లో ఫాంట్ లేదా టెక్స్ట్ సైజు ను ఎలా పెంచాలో నన్ను అడుగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఆర్టికల్ లో ఆండ్రాయిడ్ మరియు విండోస్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో టెక్స్ట్ సైజు ను ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను.


దీనికి మీరు ఈ క్రింది స్టెప్స్ ను కేర్ ఫుల్ గా ఫాలో అవ్వండి.



ఆండ్రాయిడ్

  • మొదటగా మీ Android మొబైల్‌లో Google Chrome ను ఓపెన్ చెయ్యండి.
  • ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ యొక్క కుడి పైభాగంలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.

  • ఇప్పుడు Settings అనే దానిపై క్లిక్ చేయండి.

  • తరువాత ఈ క్రింద చూపిన విధంగా Accessibility అనే దానిపై  క్లిక్ చేయండి.

  • ఇప్పుడు మీరు ఈ క్రింద చూపబడిన స్లైడర్‌ను కుడి వైపుకు జరపడం ద్వారా గూగుల్ క్రోమ్ యొక్క ఫాంట్ లేదా టెక్స్ట్ పరిమాణాన్ని పెంచవచ్చు.



విండోస్

  • మొదట, మీ Windows PC లో Google Chrome బ్రౌజర్‌ను ఓపెన్ చెయ్యండి.
  • ఆ తరువాత, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యొక్క కుడి పైభాగాన ఉన్న మూడు చుక్కల చిహ్నంపై మౌస్ తో క్లిక్ చేయండి.
  • తరువాత Settings మీద క్లిక్ చెయ్యండి.

  • తరువాత పేజీ ను స్క్రోల్ చేసి Appearance అనే సెట్టింగ్ లో వున్న Font size అనే దాని దగ్గర వున్న డ్రాప్ డౌన్ లిస్ట్ పై మౌస్ తో క్లిక్ చెయ్యండి.

  • ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఫాంట్ సైజు ను అక్కడ లభించే వాటిల్లో నుంచి ( i.e. Very small,Small,Medium,Large,Very large ) ఎంచుకోండి.


ఈ విధంగా, మీరు Google Chrome బ్రౌజర్‌లో ఫాంట్ / టెక్స్ట్ పరిమాణాన్ని మార్చుకోవచ్చు.



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి