Translate

2, ఆగస్టు 2019, శుక్రవారం

PUBG మొబైల్ లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవటం ఎలా?

How to Get  More Voice Commands In PUBG Mobile | in Telugu


How to Get  More Voice Commands In PUBG Mobile | in Telugu


గేమింగ్ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే అందరి మనసులను చూరగొన్న గేమ్ PUBG. ప్రస్తుతం సంఘంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ PUBG గేమ్ ను ఆడుతూ కనిపిస్తున్నారు.ఈ PUBG గేమ్ ఇంత పాపులర్ అవ్వటానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో PUBG లోని కమ్యూనికేషన్ ,గ్రాఫిక్స్ చెప్పుకోదగ్గవి.ఏది ఏమయినా కూడా మనము ఈ PUBG గేమ్ ను ఎక్కువగా కాకుండా కొంత లిమిట్ లో ఆడితే మంచిది.ఎందుకంటే ఈ PUBG వంటి గేమ్స్ మన మైండ్ లో హింసా ప్రవృతిని కలిగించే ప్రమాదం వుంది.

ఇది ఇలాగు ఉంటే PUBG లో మీరు మీ స్నేహితులతో గేమ్ ను ఆడేటప్పుడు డైరెక్ట్ గా  కమ్యూనికేషన్ చేసుకోవచ్చు.కానీ ఒక వేల మీ మైక్ సరిగ్గా పని చెయ్యకపోతే వాయిస్ కమాండ్స్ ను పంపుకోవచ్చు.PUBG లో డిఫాల్ట్ గా కొన్ని వాయిస్ కమాండ్స్ మాత్రమే మీకు లభిస్తాయి.కానీ PUBG లో ఇంకా చాలా వాయిస్ కమాండ్స్ వున్నాయి.మీరు ఒక చిన్న ప్రాసెస్ ద్వారా మరిన్ని వాయిస్ కమాండ్స్ ను క్విక్ చాట్ కు యాడ్ చేసుకోవచ్చు.


ఇప్పుడు మనము PUBG లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను ఎలా యాడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.


How To Add More Voice Commands In PUBG Mobile


  • ముందుగా మీరు PUBG Mobile గేమ్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత INVENTORY అనే దాని మీద క్లిక్ చెయ్యండి.


  • ఇప్పుడు ఈ క్రింద ఒకటవ నెంబర్ లో చూపబడిన బాక్స్ మీద క్లిక్ చేసి వాయిస్ చాట్ ఐకాన్ మీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత  ఎడమ ప్రక్క బాక్స్ పై భాగాన వున్న List అనే దాని మీద క్లిక్ చెయ్యండి.


  • ఇప్పుడు మీకు ఎడమ వైపున మీకు ఆల్రెడీ వున్న వాయిస్ కమాండ్స్ కనపడతాయి.మీరు మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

How To Add Voice Commands In PUBG Mobile | in Telugu 


1. మొదటగా మీరు ఎడమ ప్రక్కన క్రింది భాగాన వున్న Change అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.

2. ఇప్పుడు మీకు కావలసిన వాయిస్ కమాండ్ ను కుడి వైపు వున్న Tactics , Movement లేదా Discussion కమాండ్స్ లో నుంచి ఎంచుకోండి.

3. తరువాత ఎడమ వైపు బాక్స్ లో వున్న plus (+) సింబల్ మీద టాప్ చెయ్యగానే మీరు సెలెక్ట్ చేసుకున్న కమాండ్ మీ క్విక్ చాట్ కు యాడ్ అవుతుంది.

డిఫాల్ట్ గా వున్న వాయిస్ కమాండ్స్ ను తొలగించాలి అని అనుకుంటే సింపుల్ గా మీరు డెలీట్ చెయ్యాలి అని అనుకున్న కమాండ్ కు దగ్గర వున్న minus(-) సింబల్ పై క్లిక్ చెయ్యండి.



4. తరువాత OK మీద క్లిక్ చేసి మీరు చేసిన మార్పును సేవ్ చేసుకోండి.

ఇప్పుడు మీకు PUBG గేమ్ లో క్విక్ చాట్ బాక్స్ లో మీరు యాడ్ చేసుకున్న కమాండ్స్ ను పొందుతారు.
ఇలా మీరు వివిధ కమాండ్స్ ను PUBG క్విక్ చాట్ బాక్స్ కు యాడ్ చేసుకోవచ్చు.


This is all about "How to Get  More Voice Commands In PUBG Mobile | in Telugu"



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి