Translate

15, ఆగస్టు 2019, గురువారం

విండోస్ 10 File Explorer లో ఫైల్స్ యొక్క Extensions ను కనపడేలా చెయ్యటం ఎలా?

How To Show File Extensions In Windows 10 | in Telugu



How To Show File Extensions In Windows 10 | in Telugu


మనము ఒక ఫైల్ టైప్ ను దాని ఎక్స్టెన్షన్ ను చూసి గుర్తుపడతాము.అలానే వివిధ ఫైల్స్ వివిధ Extensions ను కలిగి ఉంటాయి.ఉదాహరణకు ఫొటోస్ jpg ,png మొదలయిన Extensions తో ఉంటే.. వీడియో ఫైల్స్ mp4 ,mkv మొదలయిన ఎక్స్టెన్షన్ తో ఉంటాయి.

విండోస్ 10 కంప్యూటర్ లో File Explorer అప్లికేషను ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్స్ ను చూపించక పొతే మీరు ఒక సెట్టింగ్ ను మార్చటం ద్వారా ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్స్ ను కనపడే విధంగా చెయ్యవచ్చు.

ఇలా ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్స్ ను కనపడేలా చెయ్యటం వల్ల మీరు ఫైల్ యొక్క టైపు ను ఈజీ గా గుర్తుపట్టడమే కాకుండా మీ కంప్యూటర్ కు సెక్యూరిటీ పరంగా కూడా చాలా మంచిది.

కాబట్టి ఇప్పుడు మనము విండోస్ 10 కంప్యూటర్ లో File Explorer లో ఫైల్స్ యొక్క Extensions ను కనపడే విధంగా ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.



How to View File Extensions In File Explorer Windows 10 | in Telugu


మెథడ్ -1

  • ముందుగా మీరు విండోస్ 10 లో Win+E ను ప్రెస్ చేసి File Explorer ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత File Explorer లో పైన వున్న ట్యాబు లలో View అనే దానిని ఎంచుకోండి.

How To Show File Extensions In Windows 10 | in Telugu

  • ఇప్పుడు ఈ క్రింది చూపిన విధంగా File name extensions అనే దానిని టిక్ చెయ్యండి.

How To Show File Extensions In Windows 10 | in Telugu



Read Also: మీ విండోస్ 10 కంప్యూటర్ లో మీకు నచ్చిన బ్రౌజర్ ను డిఫాల్ట్ బ్రౌజర్ గా సెట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ పోస్ట్ చదవండి.


మెథడ్ -2

  • ఈ మెథడ్ లో మీరు కీబోర్డ్ లోని Win+R ను ప్రెస్ చేసి రన్ డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత ఆ రన్ డైలాగ్ బాక్స్ లో control folders అని టైపు చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చెయ్యండి.
  • తరువాత ఓపెన్ అయ్యే File Explorer Options లో View అనే ట్యాబు పై మౌస్ తో క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు Hide extensions for known file types  అనే దాని మీద క్లిక్ చేసి దాని దగ్గర వున్న టిక్ మార్క్ ను తీసి వెయ్యండి.




పైన చెప్పిన మెథడ్స్ ను ఫాలో అవ్వటం వల్ల  మీరు File Explorer లో ఫైల్స్ యొక్క పేర్లతో పాటు వాటి ప్రక్కన సంభందిత ఎక్స్టెన్షన్స్ ను కూడా చూడవచ్చు.


This is all about "How To Show File Extension In Windows 10 | in Telugu"

Read Also: HTC Wildfire X స్మార్ట్ ఫోన్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి...


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి