Translate

6, ఆగస్టు 2019, మంగళవారం

అత్యంత వేగంగా విండోస్ 10 కంప్యూటర్ ను షట్ డౌన్ చేసే ట్రిక్!

How To Shutdown Windows 10 Computer With Power Button | in Telugu




మనము కంప్యూటర్ ను సాధారణంగా Alt+F4 ను వుపయోగించి లేదా స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి షట్ డౌన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవటం ద్వారా షట్ డౌన్ చేస్తాము.ఈ పద్దతులను వుపయోగించి కంప్యూటర్ ను షట్ డౌన్ చేసేటప్పుడు చాలా సమయం పట్టే అవకాశం వుంది.

కానీ ,కేవలం ఒక  పవర్ బటన్ ను ప్రెస్ చెయ్యటం ద్వారా మీరు మీ  కంప్యూటర్ ను షట్ డౌన్ చెయ్యవచ్చు అని మీకు తెలుసా ? అవును మీరు కేవలం పవర్ బటన్ ను ప్రెస్ చెయ్యటం ద్వారా మీ PC ను షట్ డౌన్ చెయ్యవచ్చు.

సాధారణంగా ఈ పవర్ బటన్ ను ప్రెస్ చెయ్యగానే మీ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళే విధంగా లేదా మరేదయినా పనిని చేసేటట్టు ప్రోగ్రాం చేసి ఉంటుంది.కానీ మనము ఈజీ గా దీన్ని మార్చుకుని పవర్ బటన్ ను ప్రెస్ చెయ్యగానే మీ విండోస్ 10 కంప్యూటర్ షట్ డౌన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు.ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


Easy and Fastest Way To Shutdown Windows 10 PC


  • మొదటగా మీరు మీ విండోస్ 10 కంప్యూటర్ లో టాస్క్ బార్ లోని సెర్చ్ బటన్ పై క్లిక్ చేసి Power అని టైపు చెయ్యండి.తరువాత సెర్చ్ రిజల్ట్స్ లో నుంచి Power & sleep settings అనే దానిపై క్లిక్ చెయ్యండి.

How To Shutdown Windows 10 Computer With Power Button

  • ఇప్పుడు మీకు ఓపెన్ అయ్యే సెట్టింగ్స్ విండో లో కుడి ప్రక్కన వున్న Additional power settings అనే దాని మీద క్లిక్ చెయ్యండి.

How To Shutdown Windows 10 Computer With Power Button | in Telugu

  • తరువాత ఎడమ ప్రక్కన వున్న choose what power button does అనే దాని మీద మౌస్ తో క్లిక్ చెయ్యండి.

How To Shutdown Windows 10 Computer With Power Button | in Telugu

  • తరువాత when i press the power button అనే దాని ముందు వున్న డ్రాప్ డౌన్ బాక్స్ ను క్లిక్ చేసి shut down అనే దానిని సెలెక్ట్ చేసుకోండి.

How To Shutdown Windows 10 Computer With Power Button | in Telugu

  • ఇప్పుడు పేజీ చివరన వున్న Save changes అనే దాని మీద క్లిక్ చేసి మీరు చేసిన మార్పులను సేవ్ చేసుకోండి.


How To Shutdown Windows 10 Computer With Power Button | in Telugu

ఇక మీరు మీ కంప్యూటర్ ను సింపుల్ గా  పవర్ బటన్ ను ప్రెస్ చెయ్యటం ద్వారా షట్ డౌన్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీ కంప్యూటర్ ను స్లీప్ మోడ్ లోకి వెళ్లేలా చెయ్యాలి అంటే Alt+F4 ను ప్రెస్ చేసి తరువాత ఓపెన్ అయ్యే పాప్ అప్ బాక్స్ లో sleep అని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ను ప్రెస్ చెయ్యండి.

ఇలా మీరు మీ విండోస్ 10 కంప్యూటర్ ను సింపుల్ గా పవర్ బటన్ ను ప్రెస్ చేసి షట్ డౌన్ చేసుకోవచ్చు.ఈ విధానం ద్వారా మీరు చాలా స్పీడ్ గా మీ కంప్యూటర్ ను షట్ డౌన్ చేసుకోవచ్చు.


This is all about "How To Shutdown Windows 10 Computer With Power Button"


Read Also: PUBG మొబైల్ లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవటం ఎలా?



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి