Translate

14, ఆగస్టు 2019, బుధవారం

HTC Wildfire X స్మార్ట్ ఫోన్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి...

HTC Wildfire X Smart Phone Launched in India With Triple Rear Camera Setup: Price and Specifications | in Telugu


HTC Wildfire X Smart Phone Launched in India With Triple Rear Camera Setup: Price and Specifications | in Telugu
Image Credits: htc.com


HTC Wildfire X మొబైల్ ఈ రోజు ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది.HTC official లైసెన్సీ అయిన In One Smart Technoloy ఈ HTC Wildfire X మొబైల్ ను ఇండియా లో లాంచ్ చేసింది.వెనుక భాగాన ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు వాటర్ డ్రాప్ నాచ్ , 10W ఫాస్ట్ ఛార్జింగ్ దీనిలోని ప్రత్యేకమయిన ఫీచర్స్.


ఈ HTC Wildfire X మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది.HTC Wildfire X స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.


HTC Wildfire X Price in India:


HTC Wildfire X స్మార్ట్ ఫోన్ ముందు చెప్పుకున్నట్లు గానే రెండు వేరియంట్ లలో వస్తుంది.HTC Wildfire X 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ Rs.9,999 వద్ద , 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ Rs.12,999 వద్ద లభిస్తుంది.ఈ మొబైల్ కేవలం Sapphire Blue కలర్ లో మాత్రమే వస్తుంది.అలాగే దీని యొక్క సేల్ August 22 నుంచి Flipkart ద్వారా జరుగనున్నది.


HTC Wildfire X Specifications:


HTC Wildfire X స్మార్ట్ ఫోన్ 6.22 అంగుళాల HD+ తెరతో ,వాటర్ డ్రాప్ నాచ్ తో , 88.8 శాతం Screen-to-body రేషియో తో వస్తుంది.ఇది అవుట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 9 pie ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తుంది.

ముందు చెప్పుకున్నట్లు గానే ఇది 3GB RAM+ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4G RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.దీనిలోని స్టోరేజ్ ను microSD స్లాట్ ద్వారా 256GB వరకు కూడా పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ లో ఏ ప్రాసెసర్ ను ఉపయోగించారో కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపరచలేదు.కానీ , XDA -Developers ప్రకారం దీనిలో MediaTek Helio P22 SoC ను వుపయోగించినట్లు సమాచారం.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన ట్రిపుల్ కెమెరా సెటప్ 12MP+8MP+5MP ను గమనించవచ్చు.అలానే దీనిలో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ను ఉపయోగించారు.

HTC Wildfire X స్మార్ట్ ఫోన్ 3300mAh బ్యాటరీ తో కూడి వుండి ,10W ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఇది Bluetooth,Wi-Fi, GPS /A-GPS ,USB Type-C ,3.5 mm జాక్ ,4G LTE మొదలయిన వాటిని కలిగి వుంది.


This is all about "HTC Wildfire X Price and Specifications in Telugu"



Read Also: విండోస్ 10 లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ను మార్చటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


ఈ పోస్ట్ మీకు నచ్చితే ఈ క్రింది బటన్స్ ద్వారా  ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి