Translate

21, ఆగస్టు 2019, బుధవారం

Realme 5 మరియు Realme 5 Pro ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్

Realme 5 and Realme 5 Pro Smartphones Launched In India With Quad Rear Camera Setups: Price and Specifications In Telugu


Realme 5 and Realme 5 Pro Smartphones Launched In India With Quad Rear Camera Setups: Price and Specifications In Telugu


Realme 5 మరియు Realme 5 Pro ఇండియా లో August 20 న లాంచ్ అయ్యాయి.Oppo సబ్ బ్రాండ్ Realme నుంచి వచ్చిన ఈ ఫోన్ లలో వెనుక భాగాన నాలుగు కెమెరాలు ఉండటం వీటిలోని ప్రత్యేకత.Realme 5 మరియు Realme 5 Pro ఫోన్స్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Realme 5 Pro ధర


Realme 5 Pro ఇండియాలో మూడు స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.Realme 5 Pro 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ Rs.13,999 , 6GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్ Rs.14,999 , 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ Rs.16,999 ధర వద్ద లభిస్తుంది.Realme 5 Pro Crystal Green మరియు Sparkling Blue అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది

Realme 5 Pro ఫోన్ యొక్క సేల్ సెప్టెంబర్ 4 నుంచి Flipkart మరియు Realme offical వెబ్సైటు ద్వారా జరుగుతుంది.


Realme 5 ధర


Realme 5 స్మార్ట్ ఫోన్ 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ Rs.9,999 ,4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ Rs.10,999 ,4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ Rs.11,999 ధర వద్ద లభిస్తుంది.Realme 5 స్మార్ట్ ఫోన్ Crystal Blue మరియు Crystal Purple అనే కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

Realme 5 యొక్క సేల్ ఆగష్టు 27 నుంచి Flipkart మరియు realme offical వెబ్సైటు ద్వారా జరుగుతుంది.

Realme 5 Pro స్పెసిఫికేషన్స్


Realme 5 Pro ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ColorOS 6 తో నడుస్తుంది.ఇది 6.3 అంగుళాల  FHD+ (1080 x 2340 pixel) dewdrop తెరతో ,గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ తో వస్తుంది.దీనిలో Qualcomm Snapdragon  712 SoC ను ఉపయోగించారు.

ముందుగా చెప్పుకున్నట్లు గానే ఇది 4GB+64GB , 6GB+64GB , 8GB+128GB అనే మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది మరియు మీరు స్టోరేజ్ ను 256GB వరకు microSD స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు

కెమెరా పరంగా Realme 5 Pro లో వెనుక భాగాన 48 MP+8 MP+2 MP+2 MP అనే క్వాడ్ కెమెరా సెటప్ ను ఉపయోగించారు.ఈ ఫోన్ ముందు భాగాన 16 మెగా పిక్సెల్ కెమెరాను ఉపయోగించారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VOLTE, Wi-Fi 802.11ac ,Bluetooth v5.0 ,GPS /A-GPS, 3.5mm జాక్ ,USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి.దీనిలో Light Proximity, Magnetic induction, Gyro-meter ,Acceleration, వెనుక భాగాన ఫింగర్ ప్రింట్ వంటి మొదలయిన సెన్సార్లు వున్నాయి.

ఈ ఫోన్ 4035mAh బ్యాటరీ తో, VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.


Realme 5 స్పెసిఫికేషన్స్


Realme 5 ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ColorOS 6 తో నడుస్తుంది.Realme 5 6.5 అంగుళాల HD+(720 x1600 pixels) తెరతో ,కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ తో వస్తుంది.దీనిలో Qualcomm Snapdragon 665 SoC ను ఉపయోగించారు.

ఇది 3GB+32GB , 4GB+64GB , 4GB+128GB అనే మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది మరియు మీరు స్టోరేజ్ ను 256GB వరకు microSD స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు

కెమెరా పరంగా దీనిలో 12 MP+8 MP+2 MP+2 MP అనే క్వాడ్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.ఈ ఫోన్ ముందు భాగాన 13MP సెల్ఫీ కెమెరా ను గమనించవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, 3.5mm జాక్ మరియు Micro-USB port వంటివి వున్నాయి.దీనిలో Light Proximity, Magnetic induction, Gyro-meter ,Acceleration, వెనుక భాగాన ఫింగర్ ప్రింట్ వంటి మొదలయిన సెన్సార్లు వున్నాయి.

ఇది 5000mAh బ్యాటరీ తో కూడి వుండి ,10W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ వస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి