Translate

9, ఆగస్టు 2019, శుక్రవారం

వాట్సాప్ తన మెసెంజర్ లో Boomerang ఫీచర్ ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం! వివరాలు ఇవి..

WhatsApp Reportedly Developing A New Instagram-Like Boomberang Feature | in Telugu


WhatsApp Reportedly Developing A New Instagram Like Boomberang Feature | in Telugu


వాట్సాప్ తన మెసెంజర్ లో Boomerang ఫీచర్ ను డెవెలప్ చేస్తున్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఈ Boomerang ఫీచర్ ను వుపయోగించి మనము లూపింగ్ వీడియో లను క్రియేట్ చేసుకోవచ్చు.Boomerang ఫీచర్ గురించి తెలియని వారు ఈ క్రింది వీడియో ను చూస్తే అర్ధం అవుతుంది.


Video Credits: instagram


ఈ ఫీచర్ ప్రస్తుతం కొన్ని అప్లికేషన్స్ లో మాత్రమే అందుబాటులో వుంది.త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ కు కూడా రానున్నట్లు WABetaInfo ద్వారా తెలుస్తుంది.ఈ ఫీచర్ మొదట iOS యూజర్స్ కు మరియు ఆ తరువాత ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.

వాట్సాప్ ట్రాకర్ అయిన WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ వాట్సాప్ లోని Video Type ప్యానల్ లో లభిస్తుంది.

Image Credits: WABetaInfo

ప్రస్తుతానికి వీడియో టైప్ ప్యానల్ ద్వారా మనము వీడియో లను కేవలం gif రూపంలోకి మాత్రమే మార్చగలుగుతున్నాము.

ఈ ఫీచర్ వాట్సాప్ లోకి వచ్చిన తర్వాత మనకు ఈ Video Type ప్యానల్ లో వీడియో మరియు gif బటన్స్ తో పాటు ఇంకొక క్రొత్త Boomerang కి సంభందించిన బటన్ కనిపిస్తుంది.

WABetaInfo యిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ కేవలం 7 సెకండ్స్ వున్న వీడియో కు మాత్రమే లభిస్తుంది.అలానే ఈ ఫీచర్ తో మనము క్రియేట్ చేసిన Boomerang వీడియో ను మన కాంటాక్ట్స్ కు పంపుకోవచ్చు లేదా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు.




Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏవయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి