Translate

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

Mi Smart Band 4 ఇండియాలో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Mi Smart Band 4 Launched in India: Price and Specifications



Xiaomi కంపెనీ ఈరోజు ఇండియాలో Mi Smart Band 4 ను లాంచ్ చేసింది.ఈ బ్యాండ్ AMOLED తెరతో వస్తుంది .దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 20 రోజుల వరకు బ్యాటరీను ఇవ్వగలదు అని కంపెనీ అంటుంది.అలాగే ఇది 50 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.దీని యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Mi Smart Band 4 Price


Mi Smart Band 4 ఇండియాలో Rs.2,299 ధర వద్ద లభిస్తుంది.ఇది సెప్టెంబర్ 19 న మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon, mi.com మరియు Mi హోమ్ స్టోర్స్ ద్వారా లభిస్తుంది.

Mi Smart Band 4 Specifications


Mi Smart Band 4  0.95 అంగుళాల AMOLED తెరతో,120x 240 పిక్సెల్ రెసొల్యూషన్ తో వస్తుంది.దీని యొక్క డిస్ప్లే 2.5D టెంపెరెడ్ గ్లాస్ తో మరియు యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ బ్యాండ్ 3-axis యాక్సిలెరోమీటర్, 3-axis గైరోస్కోప్ ,PPG హార్ట్ రేట్, కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్లు తో ,135mAh బ్యాటరీ తో , 512 KB RAM తో 16MB ROM తో Bluetooth 5.0 తో వస్తుంది.దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 20 రోజుల బ్యాటరీను ఇవ్వగలదు అని కంపెనీ అంటుంది.

Mi Smart Band 4 ఆండ్రాయిడ్ 4.4 మరియు ఆపైన వెర్షన్ లేదా iOS 9.0 మరియు ఆపైన నడుస్తున్న డివైస్ లను సపోర్ట్ చేస్తుంది.ఈ బ్యాండ్ 24 x7 హార్ట్ రేట్ మానిటరింగ్ తో పాటు క్రొత్త స్విమ్మింగ్ ట్రాకర్ ఫీచర్ తో వస్తుంది.దీని ద్వారా మీరు స్విమ్మింగ్ లో వుండే వివిధ స్ట్రోక్స్ ను కూడా ట్రాక్ చేసుకోవచ్చు.


ఇది ఇంకా స్విమ్మింగ్, రన్నింగ్ ,వాకింగ్, సైక్లింగ్, స్టెప్స్ వంటి మొదలయిన వాటిని మోనిటర్ చెయ్యగలదు.ఈ బ్యాండ్ స్లీప్ పాటర్న్ ను కూడా ట్రాక్ చెయ్యగలదు.


వీటన్నింటితో పాటు దీనిలో అలారమ్ ,అప్లికేషన్ నోటిఫికెషన్స్,Incoming call అలర్ట్స్, ఐడియల్ అలెర్ట్, స్టాప్ వాచ్ వంటి మొదలయిన ఎన్నో ఫీచర్స్ వున్నాయి.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి