Translate

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

Realme XT స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Realme XT Smartphone With Quad Camera Setup Launched in India: Price and Specifications | in Telugu




Realme XT Smartphone With Quad Camera Setup Launched in India: Price and Specifications | in Telugu



ఎప్పటి నుంచో Realme ప్రియులు ఎదురు చూస్తున్న Realme XT ఇండియాలో శుక్రవారం నాడు లాంచ్ అయ్యింది.ఇది ఇండియాలో 64 మెగా పిక్సెల్ రియర్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయిన మొట్టమొదటి మొబైల్.ఇది వెనుక భాగాన క్వాడ్ కెమెరా సెటప్ తో ,16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా తో ,ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో, Snapdragon 712 SoC తో వస్తుంది.దీని యొక్క పూర్తి వివరాలు మీరు ఈ క్రింద చదవవచ్చు.

Realme XT Price in India


Realme XT ఇండియాలో మూడు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది.4GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్ Rs.15,999 కు,6GB+64GB వేరియంట్ Rs.16,999 కు, 8GB+128GB వేరియంట్ Rs.18,999 కు లభిస్తుంది.ఈ మొబైల్ Pearl Blue మరియు Pear White కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

ఈ ఫోన్ యొక్క సేల్ Flipkart మరియు Realme Official వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 16 న మధ్యాహ్నం 12 గంటల నుండి జరుగనున్నది.ఆ తర్వాత ఈ మొబైల్ Offline స్టోర్ లలోకి వచ్చే అవకాశాలు వున్నాయి.

Realme XT Specifications


Realme XT స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ColorOS 6.0 తో నడుస్తుంది. Realme XT 6.4 అంగుళాల FHD+ (1080 x 2340 pixels) Super AMOLED తెరతో ,dewdrop స్టైల్ నాచ్ ,91.9 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోతో వస్తుంది.ఈ మొబైల్ ముందు మరియు వెనుక భాగాన గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.

ఇది Qualcomm Snapdragon 712 SoC తో 8GB వరకు RAM తో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 64 MP(ప్రైమరీ కెమెరా)+ 8MP (వైడ్ యాంగిల్ లెన్స్) + 2MP (మాక్రో లెన్స్) + 2MP( డెప్త్ సెన్సార్) అనే క్వాడ్ కెమెరా సెటప్ ను గమనించవచ్చు.దీని ముందు భాగాన 16 మెగా పిక్సెల్ (Sony IMX471 సెన్సార్) కెమెరా ను అమర్చారు.

Realme XT 4,000mAh బ్యాటరీ తో 20W VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.దీనితో మీరు 0 నుండి 100 శాతం వరకు బ్యాటరీ ను కేవలం 80 నిమిషాలలోనే నింపవచ్చు.

Realme XT లో 3.5mm జాక్ తో పాటు USB Type-C పోర్ట్ కూడా వుంది.కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE ,Wi-Fi 802.11ac ,Bluetooth 5.0 ,GPS వంటి మొదలయినవి వున్నాయి.


దీనిలో డాల్బీ అట్మాస్ ఆడియో, సిస్టం వైడ్ డార్క్ మోడ్ వంటి అద్భుతమయిన ఫీచర్స్ కూడా వున్నాయి.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి