Translate

25, సెప్టెంబర్ 2019, బుధవారం

Redmi 8A స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Redmi 8A Smartphone Launched In India With 5000mAh Battery: Price and Specifications | in Telugu


Redmi 8A Smartphone Launched In India With 5000mAh Battery: Price and Specifications | in Telugu


Redmi 8A స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది.ఈ ఫోన్ Dot Notch డిస్ప్లే, 5000mAh బ్యాటరీ ,ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ,వైర్ లెస్ FM రేడియో వంటి ప్రత్యేకతలతో వస్తుంది.Redmi 8A యొక్క ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Redmi 8A Price

Redmi 8A స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది.2GB RAM+ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs.6,499 వద్ద మరియు 3GB RAM +32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs.6,999 వద్ద లభిస్తుంది.ఈ ఫోన్ Midnight Black ,Ocean Blue,Sunset red అనే మూడు కలర్ వేరియంట్ లలో వస్తుంది.

Redmi 8A స్మార్ట్ ఫోన్ ఇండియాలో Flipkart మరియు Mi.com లలో లభించనున్నది. తరువాత ఇది offline స్టోర్స్ లోకి అందుబాటులోకి వస్తుంది.ఈ మొబైల్ యొక్క మొదటి సేల్ సెప్టెంబర్ 29 న జరుగనున్నది.

Redmi 8A Specifications

Redmi 8A స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత MIUI 10 తో నడుస్తుంది.ఇది 6.22 అంగుళాల HD+(720 x 1520 పిక్సల్స్) డిస్ప్లే తో,19:9 aspect రేషియో తో,కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.దీనిలో Qualcomm Snapdragon 439 SoC ను ఉపయోగించారు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 12 మెగాపిక్సల్ SonyIMX363 సెన్సార్ కెమెరా ను ఉపయోగించారు.దీని ముందు భాగాన మనము 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ను గమనించవచ్చు.

ముందు చెప్పుకున్నట్లుగానే ఇది 2GB+32GB ,3GB+32GB స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది.దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ ను మీరు 512GB వరకు డెడికేటెడ్ microSD స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE ,Wi-Fi, Bluetooth 4.2, GPS /A-GPS ,Wireless FM radio, USB Type-C ,Glonass ,BeiDou మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి.

ఇక Redmi 8A 5000mAh Li-Polymer బ్యాటరీ తో వస్తుంది.ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కు సపోర్ట్ చేస్తుంది.కానీ, కంపెనీ వారు ఈ మొబైల్ రిటైల్ బాక్స్ లో 10W చార్జర్ ను మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.కాబట్టి మీరు 18W చార్జర్ ను సెపెరేట్ గా కొనుగోలు చెయ్యవలసి వస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి