Translate

9, సెప్టెంబర్ 2019, సోమవారం

వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చెయ్యవలసిన ఆండ్రాయిడ్ యాప్స్!

Top 6 Best Android Applications For WhatsApp Users in 2019 | in Telugu


Top 6 Best Android Applications For WhatsApp Users in 2019 | in Telugu


వాట్సాప్ మెసెంజర్ గురించి అందరికీ తెలిసిందే.. దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ తో, సన్నిహితులతో ,తెలిసిన వారితో చాటింగ్ ,కాలింగ్ లేదా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.ఈ మధ్య వాట్సాప్ లో వివిధ క్రొత్త ,ఉపయోగకరమయిన ఫీచర్స్ వస్తున్నాయి.వాటిలో వాట్సాప్ స్టిక్కర్లు ,ఫింగర్ ప్రింట్ లాక్ మొదలయినవి ముఖ్యమయినవి.ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ప్రస్తుతం iOS వినియోగదారులకు మరియు ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో వుంది.త్వరలో సాధారణ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుంది.

అయితే వాట్సాప్ కు సంబంధించి ప్లే స్టోర్ లో ఎన్నో అప్లికేషన్స్ వున్నాయి.అవి వాట్సాప్ వినియోగదారులకు మరింత ఉపయోగాన్ని అందిస్తాయి.ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మనము ప్లే స్టోర్ లోని వాట్సాప్ వినియోగదారులకు ఉపయోగపడే కొన్ని అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం.



1.Parallel Space


Parallel Space


ఈ Parallel Space అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను వుపయోగించి మనము వివిధ అప్లికేషన్స్ ను క్లోన్ చేసుకోవచ్చు.అలాగే ఈ Parallel Space ను వుపయోగించి వాట్సాప్ ను కూడా క్లోన్ చేసుకోవచ్చు.దీని ద్వారా మీరు ఒకే ఆండ్రాయిడ్ ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ను ఉపయోగించుకోవచ్చు.తమ ఆండ్రాయిడ్ ఫోన్ లలో క్లోన్ లేదా డ్యూయల్ యాప్స్ సౌకర్యం లేని వారికి ఈ Parallel Space అప్లికేషన్ ద్వారా చాలా లాభం చేకూరుతుంది.


4.AutoResponder for WA


AutoResponder for WA


ఈ అప్లికేషన్ ద్వారా మీరు వాట్సాప్ లో ఆటోమేటిక్ గా రిప్లై ఇవ్వవచ్చు.మనము ఈ అప్లికేషన్ ద్వారా ఇతరులు పంపించే మెసేజ్ లకు ఆటోమేటిక్ గా రిప్లై ను సెట్ చేసుకోవచ్చు.తద్వారా మనము రిప్లై ఇవ్వకుండానే ఈ అప్లికేషన్ మెసేజ్ కు రెస్పాండ్ అయ్యి ఆటోమేటిక్ గా మనము సెట్ చేసిన కాంటాక్ట్ కు లేదా కాంటాక్ట్స్ కు రిప్లై యిస్తుంది.అలానే దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ వున్నాయి.ఈ అప్లికేషన్ ఫ్రీ మరియు పైడ్ వెర్షన్ లలో లభిస్తుంది.


3.WhatsApp Deleted


WhatsApp deleted


కొంత కాలం క్రితం వాట్సాప్ లో delete for everyone ఆప్షన్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఈ ఆప్షన్ ద్వారా మనము వాట్సాప్ లో పంపిన మెసేజ్ లను కొంత సమయం లోపల పర్మినెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు.కాబట్టి కొంతమంది మీకు పంపిన మెసేజ్ ను వెంటనే డిలీట్ చెయ్యగానే మీకు ఆ మెసేజ్ కనపడదు.కానీ,మీరు ఈ అప్లికేషన్ ను వాడటం వల్ల మీకు ఇతరులు పంపిన మెసేజ్ వారు డిలీట్ చేసినా కూడా ఆ మెసేజ్ ను ఈ అప్లికేషన్ ద్వారా చూడవచ్చు.


4.SKEDit Scheduling app 


SKEDit Scheduling App


ఈ అప్లికేషన్ ద్వారా మీరు వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు.ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవటానికి కూడా చాలా ఈజీ గా కూడా ఉంటుంది.మీరు పంపాలి అనుకున్న మెసేజ్ ను కాంటాక్ట్ ను మరియు సమయాన్ని ముందుగానే ఫీడ్ చేసి ఉంచితే చాలు..మీరు సెట్ చేసిన సమయానికి వాట్సాప్ లో మెసేజ్ మీరు సెట్ చేసిన వారికి వెళ్తుంది.దీని ద్వారా మీరు కేవలం వాట్సాప్ మెసేజ్ లను మాత్రమే కాదు ఈ మెయిల్స్ ,SMS మొదలయిన వాటిని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.



5.Transcriber for WhatsApp 



Transcriber for WhatsApp



Transcriber for WhatsApp ద్వారా మీరు మీకు వాట్సాప్ లో వచ్చే వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపం లో చూడగలరు.ఇది మీకు మీ ఇయర్ పీస్ అందుబాటులో లేనప్పుడు అలానే మీరు చాలా రణగొణ ధ్వనుల మధ్య వున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది.కాబట్టి వాట్సాప్ వినియోగదారులకు యిది ఒక ఉపయోగకరమయిన అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు.


6.Sticker Maker


Sticker Maker


కొన్ని నెలల క్రితం వాట్సాప్ లో స్టిక్కర్స్ ఆప్షన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ఫీచర్ ద్వారా మనము వాట్సాప్ లో వివిధ స్టిక్కర్లు ను ఇతరులకు పంపుకోవచ్చు.వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గా వచ్చే స్టిక్కర్లు తో పాటు వినియోగదారులు వివిధ స్టిక్కర్ ప్యాక్ లను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు.కానీ మీరు ఈ అప్లికేషన్ తో ఏకంగా మీ ఫొటోలతో ఒక స్టిక్కర్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు.దీని ద్వారా వినియోగదారులు చాలా ఈజీ గా తమ ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకుని వాటిని స్టికర్ ప్యాక్ గా తయారుచేసుకుని వాటిని వాట్సాప్ కు యాడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కు పంపించుకోవచ్చు.

పైన చెప్పిన అప్లికేషన్స్ వాట్సాప్ తో కలిసి పనిచేస్తూ వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.ఈ అప్లికేషన్స్ లలో మీకు ఏ అప్లికేషన్ ఎక్కువగా ఉపయోగకరంగా వుందో ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో రాయండి.


This is all about "Top 6 Best Android Applications For WhatsApp Users in 2019 | in Telugu"




Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి