Translate

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

Vivo Z1x స్మార్ట్ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ (ఇండియా)

Vivo Z1x Smartphone Price and Specifications (India)


Read in: English



VivoZ1x Smartphone Price and Specifications (India)


Vivo Z1x స్మార్ట్ ఫోన్ శుక్రవారం నాడు ఇండియాలో లాంచ్ అయ్యింది.వెనుక భాగాన 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ,4500mAh బ్యాటరీ,Super AMOLED తెర, 22.5W FlashCharge టెక్నాలజీ ,ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు.దీని ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.


Vivo Z1x స్మార్ట్ ఫోన్ ధర (ఇండియా)


Vivo Z1x ఇండియాలో  6GB RAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 6GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.ఇండియాలో దీని ధరను 6GB+64GB వేరియంట్ Rs.16,990 కు, అలానే 6GB+128GB వేరియంట్ Rs.18,990 కు సెట్ చేసారు.

ఈ ఫోన్ Phantom Purple , Fusion Blue అనే రెండు కలర్ వేరియంట్ లలో వస్తుంది.

Vivo Z1x స్మార్ట్ ఫోన్ సేల్ ఇండియాలో సెప్టెంబర్ 13 నుంచి Flipkart మరియు Vivo ఆన్లైన్ స్టోర్ ద్వారా జరుగనున్నది.


VivoZ1x స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్


Vivo Z1x 6.38 అంగుళాల FHD+ (2340 x 1080 పిక్సల్స్ ) Super AMOLED తెరతో ,వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత FunTouch OS 9.1 మీద నడుస్తుంది.దీనిలో Snapdragon 712 SoC ను ,మరియు Andreno 616 GPU ను ఉపయోగించారు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన  48 మెగా పిక్సెల్ Sony IMX582 (ప్రైమరీ కెమెరా) + 8 మెగా పిక్సెల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 2 మెగా పిక్సెల్(డెప్త్ సెన్సార్) ట్రిపుల్ కెమెరా సెటప్ ను ఉపయోగించారు.దీని ముందుభాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ను ఉపయోగించారు.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది 64GB ,128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.వినియోగదారులు దీనిలో microSD స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సదుపాయం లేదు.

కనెక్టివిటీ పరంగా చూసుకుంటే దీనిలో 4G LTE ,Wi-Fi 802.11ac ,Bluetooth 5.0, GPS /A-GPS, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ,USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి.

ఇక దీనిలో ఫింగర్ ప్రింట్ (in-display ), Accelerometer , Ambient light ,Proximity , E-compass ,virtual Gyroscope వంటి మొదలయిన సెన్సార్లు లభిస్తున్నాయి.

దీనిలో 4500mAh బ్యాటరీ ను ఉపయోగించారు.ఇది 22.5W FlashCharge టెక్నాలజీ కు సపోర్ట్ చేస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి