Translate

4, అక్టోబర్ 2019, శుక్రవారం

గూగుల్ క్యాలెండర్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవటం ఎలా?

How To Enable Dark Mode In Google Calendar  | in Telugu


How To Enable Dark Mode In Google Calendar  | in Telugu


ఆండ్రాయిడ్ లో వివిధ  అప్లికేష Pre-installed గా వస్తాయి.కానీ వీటిని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తో పోలిస్తే ఇవి చాలా తక్కువ ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.ఉదాహరణకు మీ ఫోన్ లో default గా వచ్చే క్యాలెండరు లో చాలా తక్కువ ఆప్షన్స్ మరియు ఫీచర్స్ ఉంటాయి.కానీ ప్లే స్టోర్ లో లభించే చాలా క్యాలెండర్ లలో చాలా ఫీచర్స్ ఉంటాయి.అలాంటి వాటిల్లో ఫేమస్ అయ్యింది గూగుల్ క్యాలెండర్.ఈ గూగుల్ క్యాలెండరు ను వాడే వారి సంఖ్య కూడా చాలానే వుంది.

ఇది ఇలాగు ఉంటే ఈ మధ్య ప్రతీ అప్లికేషన్ లో డార్క్ మోడ్ ఫీచర్ ను తెస్తున్నారు .ఈ డార్క్ మోడ్ లో అప్లికేషన్ ను వాడటం వల్ల మన నేత్రాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.తద్వారా మన కళ్ళకు కొంత రక్షణ కలుగుతుంది.ఈ నేపథ్యంలోనే ఈ గూగుల్ క్యాలెండరు ను వాడే వారికి కూడా ఈ డార్క్ మోడ్ అందుబాటులో వుంది.మీరు ఈ అప్లికేషన్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసి మీ కళ్ళను కొంత వరకు రక్షించుకోవచ్చు.

ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ లో ఈ గూగుల్ క్యాలెండర్ లో డార్క్ మోడ్ ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం.

How To Enable Dark Mode In Google Calendar


  • తరువాత గూగుల్ క్యాలెండర్ ను ఓపెన్ చెయ్యండి.మీకు ఈ క్రింది విధంగా వస్తుంది.మీరు అప్లికేషన్ క్రింది భాగాన కుడి ప్రక్కన వున్న Arrow సింబల్ ను కొన్ని సార్లు క్లిక్ చేసి Got it అనే దానిమీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత మిమ్మల్ని కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుంది ,మీరు ఆ పెర్మిషన్ ను ఇవ్వండి.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ మెయిన్ ఇంటర్ఫేస్ లో వుంటారు.తరువాత మీరు అప్లికేషన్ ఎడమ ప్రక్కన పై భాగాన వున్న hamburger ఐకాన్ ను టాప్ చేసి Settings మీద క్లిక్ చెయ్యండి.

  • తరువాత General అనేదాని మీద క్లిక్ చెయ్యండి.
  • తరువాత Theme అనే దాని మీద క్లిక్ చేసి Dark అనేదానిని సెలెక్ట్  చేసుకోండి.



  • ఇప్పుడు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ డార్క్ థీమ్ లోకి మారిపోతుంది.ఇలా మీరు గూగుల్ క్యాలెండరు లో డార్క్ మోడ్ ను యాక్సిస్ చేసుకోవచ్చు.


This is all about "How To Enable Dark Mode In Google Calendar  | in Telugu"


ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్లు అయితే ఈ పోస్ట్ ను మీ ఆత్మీయులకు కూడా షేర్ చెయ్యండి.ఈ ఆర్టికల్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో  అడగవచ్చు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి