Translate

9, అక్టోబర్ 2019, బుధవారం

Redmi 8 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవి..

Redmi 8 Smartphone With 5000mAh Battery Launched In India: Price and Specifications |  in Telugu




Xioami కంపెనీ Redmi 8A ను ఇండియాలో లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత Redmi 8 అనే ఇంకొక స్మార్ట్ ఫోన్ ను బుధవారం నాడు ఇండియాలో లాంచ్ చేసింది.Redmi 8 వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే,5000mAh బ్యాటరీ ,డ్యూయల్ రియర్ కెమెరా,USB Type-C పోర్ట్ వంటి ప్రత్యేకలతో వస్తుంది.దీని యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.



Redmi 8 Price (India)

Redmi 8 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.బేస్ వేరియంట్ అయిన  3 GB RAM /32 GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ.7999 లకు,4GB RAM / 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.8999 లకు లభిస్తుంది.ఇంట్రొడక్టరీ ఆఫర్ క్రింద Redmi 8 4GB RAM వేరియంట్ రూ.7999 కు లభిస్తుంది.కానీ ఈ ధర మొదటి 5 మిలియన్ల యూనిట్స్ స్మార్ట్ ఫోన్స్ కు మాత్రమే వర్తిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ అక్టోబర్ 12 నుంచి mi.com ,Mi Home స్టోర్స్ మరియు Flipkart ద్వారా జరుగనున్నది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ Oynx Black, Ruby Red,Sapphire Blue అనే మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

Redmi 8 Specifications

Redmi 8 స్మార్ట్ ఫోన్ 6.22 అంగుళాల HD+ డిస్ప్లే తో,వాటర్ డ్రాప్ నాచ్ తో,గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత MIUI 10 మీద నడుస్తుంది.దీనిలో octa-core Snapdragon 439 SoC ను ఉపయోగించారు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 12 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ను ఉపయోగించారు.ముందు భాగాన దీనిలో 8 మెగా పిక్సెల్ AI కెమెరా ను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దేనిలో 4G VoLTE ,Wi-Fi, GPS/A-GPS ,వైర్ లెస్ FM రేడియో,3.5mm హెడ్ ఫోన్ జాక్ ,USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి.సెక్యూరిటీ పరంగా దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్ లాక్ వంటి సదుపాయాలు వున్నాయి.

ముందు చెప్పుకున్నట్లు గానే ఈ ఫోన్ 3GB/32GB ,4GB/64GB వేరియంట్ లలో వస్తుంది.దీనిలో మీరు స్టోరేజ్ ను 512 GB వరకు microSD స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు.

Redmi 8 స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.కానీ మీరు దీని యొక్క రిటైల్ బాక్స్ లో 10W చార్జర్ ను మాత్రమే పొందుతారు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి