Translate

28, డిసెంబర్ 2019, శనివారం

SBI ATM లో డబ్బులు తీసుకోవాలంటే ఇక మీదట OTP తప్పనిసరా?

SBI to Launch OTP-based ATM Cash Withdrawal from January 1: Here are full details


Sbi OTP based withdraw

ఈ మధ్య మనం తరచుగా ATM ద్వారా ఫ్రాడ్ విత్ డ్రా లు ఎక్కువగా జరుగుతున్నట్లు టీవీ చానెల్స్ లో మరియు వార్తాపత్రికలలో చూస్తున్నాము.

ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ ను పెంచే ప్రయత్నం లో SBI ఒక ముందడుగు వేసి OTP ఆధారిత విత్ డ్రా ను జనవరి 1 నుంచి తీసుకురానుంది.ఈ విధానం ద్వారా SBI ATM ద్వారా డబ్బులను తీసుకోవాలంటే వినియోగదారుడు తన మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చెయ్యవలసి వస్తుంది.కానీ మీరు ఏమి కంగారు పడనవసరం లేదు.ఎందుకంటే SBI దీనికి సంభందించి ఎటువంటి సమస్యలు రావని కూడా ముందుగానే ప్రకటించింది.దీనికి సంభందించిన వివరాలు ఇలా..

ఈ OTP ఆధారిత విత్ డ్రా కేవలం రాత్రి 8 గంటల నుండి పగలు 8 గంటల వరకు చేసే విత్ డ్రా లకు మాత్రమే వర్తిస్తుంది.అలానే ఈ విధానం కేవలం SBI కార్డు హోల్డర్స్ కు మాత్రమే, అదీ కూడా SBI ATM ద్వారా మాత్రమే డబ్బులను తీసుకునే వారికే వర్తిస్తుంది.SBI కార్డు వినియోగదారులు ఇతర బ్యాంకుల ATM ల నుండి కాష్ విత్ డ్రా చేస్తే ఇది వర్తించదు.
ఇక ఈ OTP విధానం 10,000 రూపాయలు కంటే ఎక్కువ విలువ కల విత్ డ్రా లకు మాత్రమే వర్తిస్తుంది.

ఇక ప్రాసెస్ ను చూసినట్లు అయితే, మీరు ATM లో మీ ATM పిన్ ను ఎంటర్ చేసి తరువాత మీకు కావలసిన అమౌంట్ ను ఎంటర్ చేయగానే మీ బ్యాంకు అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది.మీరు దానిని ఎంటర్ చేస్తే గాని మీరు మీ ట్రాన్సక్షన్ ను కంప్లీట్ చేసుకోలేరు.

దీని వల్ల ఫ్రాడ్ లావాదేవీలను చాలా వరకు అరికట్టవచ్చు అని SBI భావిస్తుంది.




Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి