మీ ఆండ్రాయిడ్ మొబైల్ కు సంభందించిన అన్ని టెక్నికల్ వివరాలను ఇలా తెలుసుకోండి.!

How To Know All The Technical Information Of Your Android Device | in Telugu

How To Know All The Technical information Of Your Android Device

చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు తమ మొబైల్ గురించి అనగా.. మొబైల్ లో పొందుపరచబడి వున్న సెన్సార్ లు , IMEI నెంబర్ , MAC అడ్రస్ లాంటి వివిధ హార్డ్వేర్ మరియు సాఫ్ట్ వేర్ స్పెసిఫికేషన్స్ ను తెలుసుకోవాలి అని ఉంటుంది.కానీ ఇది ఎలా సాధ్యమో చాలా మందికి తెలీదు.ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుందాం అని అనుకుంటే ఒక్కొక్క వెబ్సైటులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దీనితో మీరు చాలా కన్ఫ్యూషన్ కి గురి అయ్యే ఛాన్స్ వుంది.కాబట్టి మీరు ఏ వెబ్సైటు కు వెళ్లకుండా కేవలం ప్లే స్టోర్ లో వుండే ఒక అప్లికేషన్ ద్వారా మీ ఫోన్ గురించి దాదాపు అన్ని సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ విషయాలను తెలుసుకోవచ్చు.ఇప్పుడు ఇది ఎలాగో, ఈ అప్లికేషన్ ఏంటో తెలుసుకుందాం.


  • ముందుగా మీరు DevCheck Hardware and System Info అనే అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ ఆండ్రాయిడ్ డివైస్ లో ఇన్స్టాల్ చేసుకోండి.
  • తరువాత మీరు ఈ అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యగానే మీకు ఈ క్రింది విధంగా ఇంటర్ఫేస్ కనపడుతుంది.


  • మీరు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ను అప్లికేషన్ ఇంటర్ఫేస్ లో వున్న వివిధ టాబ్స్ లపై క్లిక్ చెయ్యటం ద్వారా తెలుసుకోవచ్చు

ప్లే స్టోర్ లో ఇలాంటి అప్లికేషన్స్ చాలానే వున్నాయి కానీ వాటితో పోలిస్తే ఈ అప్లికేషన్ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ను తెలియచేస్తుంది.కావాలంటే మీరు CPU-Z, Device Info
లను కూడా ప్రయత్నించవచ్చు.ఇవి కూడా ఈ అప్లికేషన్ మాదిరిగానే మీ డివైస్ కి సంభందించిన వివరాలను అందిస్తాయి.

ఇలా మీరు మీ డివైస్ కు సంభందించిన వివిధ సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ విషయాలను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి కన్ఫ్యూషన్ కి గురి అవ్వకుండా తెలుసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు

Translate