Instagram Starts Expanding DM(Direct Messaging) Feature To It's Web Version



ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ గురించి తెలియని వారు చాలా తక్కువ మంది వుంటారు.రోజూ ఎంతో మంది ఈ అప్లికేషన్ ద్వారా తమ ఫొటోస్ ను లేదా వీడియోస్ ను షేర్ చేసుకుంటారు.

అలానే ఈ ఇంస్టాగ్రామ్ కు వెబ్ వెర్షన్ కూడా వుంది.దీని ద్వారా మీరు బ్రౌజర్ ద్వారా ఇంస్టాగ్రామ్ లోకి లాగిన్ అయ్యి కార్యకలాపాలను కొనసాగించవచ్చు.

కానీ, ఈ ఇంస్టాగ్రామ్ వెబ్ వెర్షన్ లో అప్లికేషన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి.వాటిలో చాలా ఇబ్బందికి గురిచేసే అంశం ఏమిటంటే, ఈ ఇంస్టాగ్రామ్ వెబ్ వెర్షన్ లో DM (Direct Messaging) ఫీచర్ లేదు.

కానీ ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇంస్టాగ్రామ్ త్వరలో ఈ DM ఫీచర్ ను వెబ్ వెర్షన్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నది.ఈ ఫీచర్ ఆల్రెడీ టెస్టింగ్ స్టేజి లో వుంది.మరియు చాలా కొద్దిమంది ఈ ఫీచర్ ను పొందినట్లు సమాచారం.ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజి లో వుంది కాబట్టి ఇది అందరికీ రావటానికి కొంత సమయం పడుతుంది.




ఇంస్టాగ్రామ్ అప్లికేషన్ లో మాత్రమే వున్న ఈ ఫీచర్ వెబ్ వెర్షన్ కి కూడా వచ్చినట్లు అయితే మీరు ఇంకా తేలికగా బ్రౌజర్ నుంచే DM సింబల్ ను క్లిక్ చేసి లేదా యూజర్ యొక్క ప్రొఫైల్ లోకి వెళ్లి Message అనే బటన్ పై క్లిక్ చేసి చాట్ చేసుకోవచ్చు.అప్లికేషన్ లో మాదిరిగానే మీరు ఫొటోస్ మరియు వీడియోస్ ను కూడా పంపుకోవచ్చు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది