Realme 5i Smartphone Launched in India: Price and Specifications | in Telugu

Realme 5i Smartphone Launched in India: Price and Specifications | in Telugu



Realme ఈరోజు సరికొత్త Realme 5i మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కొన్ని రోజుల క్రిందట వియత్నాం లో లాంచ్ చేసారు.ఇది వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్ డిస్ప్లే తో , 5000mAh సామర్ధ్యం కల బ్యాటరీ తో, వెనుక భాగాన నాలుగు కెమెరాలతో, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ను మరియు ధరను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Realme 5i Price


Realme 5i స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో Rs.8,999 గా సెట్ చేశారు. ఇది కేవలం ఒకే వేరియంట్ లో (4GB RAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్) తో వస్తుంది.ఇది ఆక్వా బ్లూ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో వస్తుంది.ఈ ఫోన్ జనవరి 15 నుండి Flipkart మరియు realme.com ద్వారా లభించనున్నది.

Realme 5i Specifications


Realme 5i స్పెసిఫికేషన్స్ ను చూసినట్లు అయితే ఇది 6.5 అంగుళాల(16.5cm)HD+ (720 x 1600 పిక్సల్స్) తెరతో, 20:9 aspect రేషియో, 89 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో తో వస్తుంది. దీనిలో డిస్ప్లే ను ప్రొటెక్ట్ చేసేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ను వాడారు.Realme 5i ఆండ్రాయిడ్ 9 Pie తో ColorOS 6.0.1 మీద నడుస్తుంది.

దీనిలో octa-core Qualcomm Snapdragon 665 AIE SoC ను ఉపయోగించారు.ముందుగా చెప్పుకున్నట్లు యిది 4GB RAM తో వస్తుంది.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన నాలుగు కెమెరాలు, 12-మెగా పిక్సెల్ (ప్రైమరీ కెమెరా), 8-మెగాపిక్సల్ (వైడ్ యాంగిల్ కెమెరా), 2-మెగాపిక్సల్ (మాక్రో లెన్స్) మరియు 2-మెగాపిక్సల్ (పోర్ట్రైట్ కెమెరా) ను ఉపయోగించారు.సెల్ఫీల కోసం దీనిలో ముందు భాగాన 8-మెగా పిక్సల్ కెమెరా ను అమర్చారు.

Realme 5i త్రీ కార్డ్ స్లాట్ (డ్యూయల్ నానో SIM+MicroSD) తో వస్తుంది. ఇది 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు స్టోరేజ్ ను మీరు microSD స్లాట్ ద్వారా 256 GB వరకు పెంచుకోవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4GB VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/A-GPS, Micro-USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి. దీనిలో లైట్ సెన్సార్,గైరో మీటర్, యాక్సిలెరోమీటర్, ambient , ప్రాక్సిమిటీ , ఫింగర్ ప్రింట్ (వెనుక భాగాన) సెన్సార్లు వున్నాయి.

Realme 5i స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ తో వస్తుంది.ఇది రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది