Translate

4, జనవరి 2020, శనివారం

వివో S1 ప్రో స్మార్ట్ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్..

Vivo S1 Pro Smartphone With Quad Rear Camera Setup, 4500mAh battery Launched in India: Price and Specifications | in Telugu

Vivo S1 Pro Smartphone With Quad Rear Camera Setup, 4500mAh battery Launched in India: Price and Specifications

నిన్న అనగా శుక్రవారం నాడు వివో ఒక సరికొత్త మొబైల్ (వివో S1 ప్రో) ను ఇండియా లోకి లాంచ్ చేసింది.వెనుక భాగాన నాలుగు కెమెరాలు,18W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 8GB RAM దీనీలోని కొన్ని ప్రత్యేకతలు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ క్రింద చదవవచ్చు.

వివో S1 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్ 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.దీని ధరను ఇండియాలో Rs.19,990 కు సెట్ చేశారు.ఈ ఫోన్ Mystic Black, Jazy Blue, and Dreamy White అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.ఈ ఫోన్ ప్రసిద్ద ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లలో ఈరోజు నుండి లభించనున్నది.

ఇక స్పెసిఫికేషన్స్ ను చూసినట్లు అయితే, ఇది 6.38 అంగుళాల (1080 x 2340 పిక్సల్స్)
FHD+ AMOLED  తెరతో, వాటర్ డ్రాప్ నాచ్,19.5:5 aspect రేషియో తో,90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ మరియు FunTouch OS 9.2 మీద నడుస్తుంది.

దీనిలో octa-core Snapdragon Qualcomm 665 SoC ను ఉపయోగించారు.ముందు చెప్పుకున్నట్లు గానే ఇది 8GB RAM మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన నాలుగు కెమెరా లు 48MP (ప్రైమరీ కెమెరా)+8MP(వైడ్ యాంగిల్ లెన్స్)+2MP(Marco లెన్స్)+2MP(డెప్త్ సెన్సార్) ను డైమండ్ ఆకారం లో అమర్చారు.దీనిలో ముందు భాగాన 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ను అమర్చారు.

Vivo S1 Pro Smartphone With Quad Rear Camera Setup, 4500mAh battery Launched in India: Price and Specifications
కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi (డ్యూయల్ బ్యాండ్), Bluetooth v5.0, GPS/ A-GPS, USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి. ఇంకా దీనిలో యాక్సిలెరోమీటర్, ambient లైట్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు వున్నాయి.

ఇది 4500 mAh బ్యాటరీ తో,18W డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి