Samsung Galaxy M31 ఇండియాలో 6000mAh బ్యాటరీ తో లాంచ్ అయ్యింది:ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M31 With 6000mAh Battery Launched In India: Price and Specifications | in Telugu 



Samsung Galaxy M31 With 6000mAh Battery Launched In India: Price and Specifications | in Telugu

Samsung Galaxy M31 ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది.ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,6000mAh బ్యాటరీ తో, 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.దీని ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను  మీరు ఈ క్రింద చదవవచ్చు.

Samsung Galaxy M31 ధర(ఇండియా):

Samsung Galaxy M31 రెండు స్టోరేజ్ వేరియంట్స్ లలో లభిస్తుంది. 6GB RAM +64GB ఇంటర్నల్ స్టోరేజ్ ధరను రూ.15,999 గా మరియు 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధరను  రూ.16,999 గా సెట్ చేశారు.ఈ స్మార్ట్ ఫోన్ ఓషన్ బ్లూ మరియు స్పేస్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.ఇంట్రొడక్టరీ ఆఫర్ క్రింద ఈ ఫోన్ 1000 రూపాయల డిస్కౌంట్ లో లభించనున్నది.ఈ మొబైల్ మార్చ్ 5 నుండి samsung ఆన్లైన్ స్టోర్, అమెజాన్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో లభించనున్నది.

Samsung Galaxy M31 స్పెసిఫికేషన్స్:

Samsung Galaxy M31 6.4 అంగుళాల FHD+ (1080 x 2340 ఫిక్సల్స్) సూపర్ AMOLED తెరతో ,19.5:9 aspect  రేషియో తో వస్తుంది.

దీనిలో octa-core Exynos 9611 ప్రాసెసర్, Mali-G72 MP3 GPU ను ఉపయోగించారు.ఇది ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో ,OneUI 2.0 కస్టమ్ UI తో నడుస్తుంది.

Image Source: samsung

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా,8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ macro కెమెరాను అమర్చారు.సెల్ఫీల కోసం దీని ముందు భాగాన 32 మెగాపిక్సల్ కెమెరా ను ఏర్పాటుచేశారు.

Samsung Galaxy M31 స్మార్ట్ ఫోన్ 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది మరియు మీరు స్టోరేజ్ ను 512GB వరకు microSD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS /A-GPS, USB Type-C, 3.5mm జాక్ మొదలయినవి వున్నాయి.

Samsung Galaxy M31 లో మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను వెనుక భాగాన గమనించవచ్చు.

దీనిలో 6000mAh బ్యాటరీ ను పొందుపరిచారు.ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.దీనిలో యాక్సిలెరోమీటర్ ,ఫింగర్ ప్రింట్ గైరో,జియోమాగ్నెటిక్ ,ప్రాక్సిమిటీ,వర్చ్యువల్ లైట్ సెన్సార్ లు వున్నాయి.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు

Translate