Force Android Facebook Application To Open Links In External Browser


Force Android Facebook Application To Open Links In External Browser

సాధారణంగా మనము ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు అప్లికేషన్ లోని ఏదయినా లింక్ ను ఓపెన్ చేస్తే ఆ లింక్ ఎక్కువశాతం in-app బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది.ఇలా అప్లికేషన్ ప్రొవైడ్ చేసిన ఇంటర్ఫేస్ లో లింక్స్ ఓపెన్ అవ్వటం వల్ల మనము ఆ పేజీ మీద ఎక్కువ కార్యకలాపాలను చేయలేము. మనము ఆ లింక్ ని కాపీ చేసి లేదా Open in browser అనే దానిపై క్లిక్ చేస్తే తప్ప ఆ లింక్ మన డీఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వదు.

కానీ, ఇప్పుడు మనము ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఫేస్ బుక్ అప్లికేషన్ లోని లింక్స్ ను డైరెక్ట్ గా మన ఆండ్రాయిడ్ లోని డీఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేలా ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.

  • ముందుగా మీ ఆండ్రాయిడ్ లో ఫేస్ బుక్ అప్లికేషన్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత మీరు అప్లికేషన్ లోని Hamburger ఐకాన్ మీద క్లిక్ చెయ్యండి.

Force Android Facebook Application To Open Links In External Browser

  • ఇప్పుడు  Settings & Privacy అనే దాని మీద క్లిక్ చేసి Settings అనే దాని మీద క్లిక్ చెయ్యండి.
Force Android Facebook Application To Open Links In External Browser

Force Android Facebook Application To Open Links In External Browser
  • ఇప్పుడు పేజీ ను స్క్రోల్ చేసి Media and Contacts అనే దానిపై క్లిక్ చేసి ఈ క్రింద చూపించబడిన విధంగా Links open externally అనే దాని ప్రక్కన వున్న toggle ను ఆన్ చెయ్యండి.

Force Android Facebook Application To Open Links In External Browser

Force Android Facebook Application To Open Links In External Browser
ఇలా మీరు మీ ఆండ్రాయిడ్ ఫేస్ బుక్ అప్లికేషన్ లోని లింక్స్ ను డీఫాల్ట్ గా బయటి బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేలా చెయ్యవచ్చు.

ఈ పోస్ట్ కనుక మీకు నచ్చినట్లు అయితే మీ ఆత్మీయులకు షేర్ చెయ్యండి.అలానే మీకు ఈ పోస్ట్ కు సంభందించి ఎటువంటి సందేహాలు అయినా ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యగలరు.

Read Also: మీ ఆండ్రాయిడ్ మొబైల్ కు సంభందించిన అన్ని టెక్నికల్ వివరాలను ఇలా తెలుసుకోండి.!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది