How To Add Control Panel To Start Menu In Windows 10 | in Telugu


How To Add Control Panel To Start Menu In Windows 10


విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మనం ఎన్నో రకాల హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ కి సంభందించిన సెట్టింగ్స్ ను యాక్సిస్ చెయ్యటానికి మనం కంట్రోల్ ప్యానెల్ అప్లికేషన్ ను ఉపయోగిస్తాము.మనం కంట్రోల్ ప్యానెల్ ద్వారా తరచుగా ఉపయోగించే సెట్టింగ్స్ లో  Power Options, Mouse, Network and Sharing Center, Battery మరియు ఫైర్ వాల్ కి సంభందించిన సెట్టింగ్స్ ముఖ్యమయినవి.

ఇలాంటి ప్రాధాన్యత కల కంట్రోల్ ప్యానెల్ ను యాక్సిస్ చెయ్యటానికి మనకి చాలా విధానాలు వున్నాయి.వీటిలో సెట్టింగ్స్ ద్వారా, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యాక్సిస్ చెయ్యటం మనకు తెలిసిన కొన్ని పద్ధతులు.కానీ ఈ విధానాల ద్వారా కంట్రోల్ ప్యానెల్ ను ఓపెన్ చెయ్యటానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.

కానీ మనము ఈ కంట్రోల్ ప్యానెల్ ను స్పీడ్ గా యాక్సిస్ చెయ్యటానికి ఒక అద్భుతమయిన మార్గం వుంది. అదే కంట్రోల్ ప్యానెల్ టైల్ ను స్టార్ట్ మెనూ కు యాడ్ చెయ్యటం.ఇలా చెయ్యటం ద్వారా మీరు కంట్రోల్ ప్యానెల్ ను స్టార్ట్ మెనూ ద్వారా ఈజీ గా యాక్సిస్ చేసుకోవచ్చు.

ఇప్పుడు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో కంట్రోల్ ప్యానెల్ టైల్ ను స్టార్ట్ మెనూ కు ఎలా యాడ్ చెయ్యాలో చూద్దాం.

  • మొదటగా మీరు Windows Key+S బటన్ ను ప్రెస్ చెయ్యటం ద్వారా సెర్చ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యండి.
  • తరువాత సెర్చ్ బాక్స్ లో control panel అని టైపు చేసి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చే control panel అనే దాని పైన మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి.
  • తరువాత Pin to Start అనే దాని మీద క్లిక్ చెయ్యండి.
how to add control panel to start menu in windows 10

ఇక మీరు ఈజీ గా కంట్రోల్ ప్యానెల్ ను స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి ఈ క్రింది చూపించబడిన విధంగా కంట్రోల్ ప్యానెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్సిస్ చేసుకోవచ్చు.

How To Add Control Panel To Start Menu In Windows 10


Read Also: విండోస్ 10 లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ను మార్చటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది