టెక్ న్యూస్ [ 21/04/2020 మరియు 22/04/2020]


Read Also in:
 English


daily-tech-news-in-telugu

#1. Huawei Watch GT 2 కు ఇండియా లో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది.


Huawei Watch Gt 2 కు ఇండియాలో క్రొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చినట్లు సమాచారం.ఈ అప్డేట్ లో మన శరీరంలోని SpO2 లెవెల్స్ ను కొలిచే ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చెయ్యటం జరిగింది.ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్ దాదాపు 18.37 MB సైజు వుంది.ఈ అప్డేట్ లో ఈ క్రొత్త ఫీచర్ తో పాటు సాఫ్ట్ వేర్ కి సంభంధించి కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ ను కూడా తీసుకువచ్చారు.


#2. ప్రముఖ థర్డ్ పార్టీ స్టోర్ Aptoide డేటా బ్రీచ్ కు గురి అయ్యింది.
ప్రముఖ థర్డ్ పార్టీ స్టోర్ అయిన Aptoide డేటా బ్రీచ్ కు గురి అయ్యింది.ఈ స్టోర్ లో రిజిస్టర్ అయివున్న దాదాపు 39 మిలియన్స్ యూజర్స్ యొక్క డేటా ను Hackers దొంగిలించారు.ఈ డేటా లో కొంతభాగాన్ని ఇప్పటికే ప్రముఖ హాకింగ్ ఫోరమ్ లో పోస్ట్ చెయ్యటం జరిగింది.ఈ డేటా లో డేట్ అఫ్ బర్త్,డివైస్ వివరాలు మొదలయినవి వున్నాయి అని తెలుస్తుంది.


#3. మైక్రోసాఫ్ట్  విండోస్ యొక్క ప్రముఖ అప్లికేషన్ నోట్ పాడ్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ను సందర్శించింది..!


మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క ప్రముఖ అప్లికేషన్ నోట్ పాడ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొనుటకు లభిస్తుంది.ఈ అప్లికేషన్ పేరు Windows Notepad గా వుంది. అలానే దీని లోగో ను కూడా మార్చారు. ఈ అప్లికేషన్ లో కొన్ని క్రొత్త ఫీచర్స్ ను కూడా యాడ్ చెయ్యటం జరిగింది.కానీ, ఈ Windows Notepad అప్లికేషన్ విండోస్ 10 వెర్షన్ 19541.0 లేదా ఆపైన ఉపయోగించే వారికి మాత్రమే లభిస్తుంది.


#4. వాట్సాప్ గ్రూప్ వీడియో లేదా ఆడియో కాల్స్ లో పాల్గొనే సభ్యుల పరిమితిని ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ లో 8 మందికి(మీతో కలిపి) పెంచటం జరిగింది


ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.133 లో గ్రూప్ ఆడియో కాల్స్ మరియు వీడియో కాల్స్ లో పాల్గొనే సభ్యుల పరిమితిని 8 (మీతో కలిపి) కు పెంచబడింది.వాట్సాప్ ఈ ఫీచర్ ను త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఆల్రెడీ ఇంతకముందు ఈ పోస్ట్ లో రాయటం జరిగింది.ఈ ఫీచర్ సాధారణ యూజర్స్ కు రావటానికి కొంత సమయం పడుతుంది.అయితే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవటానికి మీతో సహా మీరు కాల్ చేసిన ఒక్కరూ లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ కి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది.


#5. వాట్సాప్ WHO తో కలిసి క్రొత్త Together at Home అనే స్టిక్కర్లను ఇంట్రడ్యూస్ చేసింది
వాట్సాప్ WHO తో కలిసి కరోనా నేపథ్యంలో తన మెసెంజర్ లో Together at Home అనే పేరుతో క్రొత్త స్టిక్కర్ ప్యాక్ ను ఇంట్రడ్యూస్ చేసింది.ప్రస్తుతం ఈ స్టిక్కర్లు ఇంగ్లీష్ భాషలోనే కాకుండా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో కూడా లభిస్తున్నాయి.మీరు కూడా వీటిని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.


#6. గూగుల్ బీటా వెర్షన్ 11.6.6 అప్లికేషన్ లో మీరు ఓపెన్ చేసిన లింక్స్ డిఫాల్ట్ బ్రౌజర్ లో కాకుండా అప్లికేషన్ లోనే ఓపెన్ అవుతాయిగూగుల్ అప్లికేషన్ యొక్క క్రొత్త బీటా వెర్షన్ 11.6.6 లో in-app బ్రౌజర్ ను ఇంట్రడ్యూస్ చెయ్యటం జరిగింది.అనగా మీరు ఈ అప్లికేషన్ లో ఓపెన్ చేసిన లింక్స్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్ గా అప్లికేషన్ లోనే ఓపెన్ అవుతాయి.అయితే, మీరు ఈ సదుపాయాన్ని సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు.ముందుగా చెప్పినట్లు ఈ సదుపాయం ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే సాధారణ వినియోగదారులు కూడా దీనిని పొందగలరు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది