టెక్ న్యూస్ [ 23/04/2020 మరియు 24/04/2020]


daily-tech-news-in-telugu

#1. ఈ ఎయిర్టెల్ ప్యాక్ తో మీరు Disney+Hotstar VIP సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.!ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మరొక క్రొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఇంట్రడ్యూస్ చేసింది.ఈ క్రొత్త ప్లాన్ తో Disney+Hotstar VIP సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. ఇక వివరాలలోకి వెళ్తే ఈ క్రొత్త ప్రీపెయిడ్ ప్లాన్ Rs. 401 ల విలువ కలది.దీనితో రీఛార్జ్ చేసుకోవటం ద్వారా మీరు 3GB డేటా ను పొందగలరు.అలానే రూ.399 విలువగల Disney+Hotstar VIP సబ్స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా పొందవచ్చు.ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎయిర్టెల్ అప్లికేషన్ లో మరియు Official వెబ్ సైట్ లో కూడా లిస్ట్ చెయ్యటం జరిగింది.


#2. ఇప్పుడు Apple టిక్ టాక్ లో కూడా..!
ప్రముఖ iPhone తయారీదారు Apple ఇప్పుడు టిక్ టాక్ లో కూడా అకౌంట్ ను ఓపెన్ చేసింది.అయితే ఈ ఆర్టికల్ రాసే సమయానికి Apple తన ఖాతాలో ఎలాంటి వీడియోస్ ను అప్లోడ్ చెయ్యలేదు అలానే 6185 ఫాలోయర్స్ కలిగి ఉంది.చూడాలి ఈ అకౌంట్ ను Apple ఎలా వినియోగించుకుంటుందో అని..


#3. iQOO 3 స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఇండియాలో భారీగా తగ్గింది..


వివో సబ్ బ్రాండ్ అయిన iQOO తన iQOO 3 స్మార్ట్ ఫోన్స్ యొక్క ధరను ఇండియాలో తగ్గించింది.ఈ iQOO 3 స్మార్ట్ ఫోన్ 8GB/128GB (4G), 8GB/256GB (4G), 12GB/256GB (5G) అనే మూడు స్టోరేజ్ వేరియంట్స్ లలో వస్తుంది.వీటి యొక్క పాత మరియు ప్రస్తుత ధరలు క్రింద ఇవ్వటం జరిగింది.ఈ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత లేదా లాక్ డౌన్ సడలింపు ప్రక్రియలో అందుబాటులోకి రావొచ్చు.#4. నోకియా 2.3 కు ఇండియా లో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది.


నోకియా 2.3 కు ఇండియాలో ఆండ్రాయిడ్ 10 కు సంభంధించిన సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చినట్లు సమాచారం.ఈ అప్డేట్ లో ఆండ్రాయిడ్ 10 తో పాటు మార్చ్ నెల సెక్యూరిటీ ప్యాచ్ ను కూడా కంపెనీ రోల్ ఔట్ చేసింది.ఈ అప్డేట్ యొక్క వెర్షన్ v2.230 గా మరియు సైజ్ 1.1GB గా ఉంది.


#5. వన్ ప్లస్ 8 ప్రో లో సమస్య..
వన్ ప్లస్ యొక్క ఫ్లాగ్ షిప్ వన్ ప్లస్ 8 ప్రో లోని డిస్ప్లే లో గ్రీన్ కలర్ కి సంభంధించి కొంత సమస్య ఉన్నట్లు కొంతమంది యూజర్స్ వన్ ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్స్ లో పోస్ట్ చేస్తున్నారు.ఈ గ్రీన్ టింట్ కొంతమందికి డార్క్ గా వున్న ఇమేజ్ లను ఎక్కువ బ్రైట్ నెస్ తో చూసినప్పుడు వస్తుంది అని సమాచారం.కొంతమంది తాము DC డిమ్మింగ్ ను ఆఫ్ చేసినప్పుడు ఈ సమస్య నుండి బయటపడ్డాము అని ఫోరమ్ లో పోస్ట్ చేస్తున్నారు.అయితే వన్ ప్లస్ దీనికి సంభంధించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని మరియు ఈ సమస్య పరిష్కారం అయిన తరువాత ఫిక్స్ ను OTA అప్డేట్ గా విడుదల చేస్తాము అని అన్నది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది